Take a fresh look at your lifestyle.

జగిత్యాల టౌన్ సిఐ గా నటేష్

0 13

జగిత్యాల టౌన్ సిఐ గా నటేష్

జగిత్యాల, జూన్ 14 : మల్టీ జోన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు సర్కిల్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా జగిత్యాల టౌన్ సిఐ గా పని చేస్తున్న రామ్ చందర్ రావును కరీంనగర్ టూ టౌన్ కు బదిలీ అయ్యారు.  కరీంనగర్ వన్ టౌన్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ నటేష్ ను జగిత్యాల టౌన్ కు బదిలీ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీచేశారు.నటేష్ కు జగిత్యాల జిల్లాపై పట్టుంది.

గతంలో మెట్ పల్లి సిఐ గా పనిచేసిన అనుభవం నటేష్ కు ఉంది. నటేష్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినంగా వ్యవహారిస్తారనే పేరుంది.రెండు రోజుల్లోపు ఆయన విధుల్లో చేరనున్నారు.
జగిత్యాల టౌన్ సిఐగా నటేష్ నియామకం పట్ల పోలీసులు, ప్రజా సంఘాలు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking