Take a fresh look at your lifestyle.

మున్సిపల్ దళిత చైర్ పర్సన్ స్రవంతిపై అగ్రవర్ణం మాజీ ఎమ్మెల్యే వేదింపులు..

0 26

మున్సిపల్ దళిత చైర్ పర్సన్ స్రవంతి చందుపై అగ్రవర్ణాల పెత్తనం..
– న్యాయం కోసం జాతీయ ఎస్సీ కమీషన్ కు ఫిర్యాదు
– మాజీ ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ పై ఎస్సీ అట్రాసిటి కేసు
– కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశ..

పొలిటికల్.. అగ్రవర్ణాల అధిపత్యంతో అణచబడిన దళిత వర్గాలు ఎప్పుడు అన్యాయానికి గురైతునే ఉన్నారు. రిజర్వేషన్ పుణ్యనా ప్రజాప్రతినిధులుగా పదవిలు వచ్చినా అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక అవమానపరుస్తూ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇగో.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి చందు – ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య అగ్రవర్ణాలు – దళితుల మధ్యన జరుగున్న వార్ చివరకు పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ప్రభుత్వం మారడంతో రెండేళ్ల క్రితం చేసిన ఫిర్యాదుకు చలనం వచ్చి ఆ మాజీ ఎమ్మెల్యే, అతని కుమారుడుతో పాటు అప్పటి కలెక్టర్, అప్పటి మున్సిపల్ కమీషనర్ లపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

మున్సిపల్ చైర్ పర్సన్ గా స్రవంతి చందు..

2020లో ఇబ్రహీం పట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎస్సీ రిజర్వేషన్.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుని ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ కప్పరి లక్ష్మయ్యను పిలిపించి చర్చించారు. ఎస్సీ రిజర్వేషన్ కావడంతో చైర్ పర్సన్ పదవి మీదే కానీ.. పార్టీ అవసరాల కోసం మూడు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. మున్సిపల్ జనరల్ లో కౌన్సిలర్ గా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య కోడలు స్రవంతి చందు గెలిశారు. అంతే.. అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి 2 కోట్ల 50 లక్షలు చెల్లించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా స్రవంతి చందు ఎంపికయ్యారు.

వివాదం ఎక్కడా..?

2020లో కరోనా మొదటిసారి ప్రజలను అతలకుతలం చేసింది. అప్పుడే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎంపికైన స్రవంతి చందు పేదలకు సహాయం చేయడం ప్రారంభించారు. కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా బోజన వసతి కల్పించారు. అంతే.. ఆ మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి చందు గురించి ప్రతి రోజు డైలీ పేపర్ లలో వార్త కథనాలు రావడం ప్రజలలో మంచి పేరు సంపాదించారు.

కరోనా సమయంలో ప్రజలతో..

‘‘స్వచ్ఛ సర్వేక్షన్’’ అవార్డు

దళిత మహిళ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయడాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పని తీరును గుర్తించింది. ‘‘స్వచ్ఛ సర్వేక్షన్’’ కు ఎంపిక చేసింది. అయితే.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డును మున్సిపల్ కమీషనర్ స్వీకరిస్తాడని మీరు వెళ్లాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేగా ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ చైర్ పర్సన్ స్రవంతి చందు ఢిల్లీ వెళ్లి అవార్డు తీసుకోవడం మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నచ్చలేదు.

సెలవుపై వెళ్లాలని అగ్రవర్ణం అంకారం

రోజు రోజుకు రాజకీయంగా ఎదుగుతున్న స్రవంతిపై కోపంతో ఉన్న అతను ప్రతి రోజు పేపర్ లు వార్తలు వస్తే ఎలా…? మూడు నెలలు సెలవులో వెళ్లితే వైస్ చైర్మన్ కు ఇంచార్జీగా బాధ్యతలు ఇద్దామని మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతికి నచ్చ చెప్పారు అప్పటి ఎమ్మెల్యే. అందుకు నిరాకరించండంతో స్రవంతిపై కక్ష పెంచుకున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతికి ఎలాంటి సహాయం చేయద్దాని అధికారులను ఆదేశించారు. అంతే.. దళిత మహిళను మానసికంగా ఇబ్బందులు పెట్టడంతో ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డిలకు ఫిర్యాదు చేశారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని వారు హామి ఇచ్చి పట్టించుకోలేరు. పైగా అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ సైతం తమను వేదించడంతో చివరకు జాతీయ ఎస్సీ కమీషన్ కు దళిత చైర్ పర్సన్ స్రవంతి చందు ఫిర్యాదు చేశారు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking