Take a fresh look at your lifestyle.

TSPSC తరుపున వకల్తా పుచ్చుకున్న మంత్రి కేటీఆర్

0 254

TSPSC తరుపున వకల్తా పుచ్చుకున్న మంత్రి కేటీఆర్

: బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమాఱ్

హైదరాబాద్. మార్చి 28 : కెటిఆర్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయనే అనుమానం బలపడిందన్నారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. అందుకే మంత్రి కేటీఆర్  TSPSC తరుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నరన్నారు ఆయన.

లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న కమీషన్ సభ్యులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు  డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పేపర్ లీకేజ్ తో సంబంధం ఉన్న వాళ్లపై సిబిఐ, ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు చెప్పాల్సిన టీెఎస్ పిఎస్ సీ చైర్మన్ మీడియా ముందుకు రాకుండా కెటిఆర్ అన్ని తానై మాట్లాడుతున్నరన్నారు.

KTR కి  పేపర్ లీకేజ్ తో సంబంధం లేకుంటే అధికారిక డాటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.  మంత్రికి ఈ డాటా ఎవరు ఇచ్చారన్నారు ఆయన. పేపర్ లీేకేజ్ లో ప్రశ్నించిన తమకు  91 crpc నోటీసులు ఇస్తూ  మంత్రి డాటా ఇస్తున్నారన్నారు ఆయన.

నేను లీక్ చేస్తే నా జిల్లా, మండలం అంతా లీక్ చేస్తాను కదా అనడం దుర్మార్గం అన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. కేవలం ఇద్దరి సమస్య అని కెటిఆర్ , కోతికి కొబ్బరి చిప్ప దొరికిందటూ జగదీశ్వర్ రెడ్డి, ఇదంతా కామన్ అని ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులు మాట్లాడడం దారుణం అన్నారు ఆయన.

పిఎ ను వాడు, వీడు అంటూ సంబోధించారు ఇదెక్కడి సంస్కారం? పబ్లిక్ గా వాడు వీడు అంటూ మాట్లాడడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సిట్ కి ఎలాంటి విలువలు ఉన్న కేటిఆర్ కు నోటీసులు ఇవ్వాలన్నారు ఆయన.  ఎన్ని మార్కులు దాటితే క్వాలిఫై అవుతారు.? ఎన్ని మార్కులు వస్తే పాసయ్యారు అనే విషయాలు కెటిఆర్ కు ఎలా తెలుసు… కట్ ఆఫ్ మార్కులు ఎలా తెలుసు. చైర్మెన్ జనార్దన్ రెడ్డి మీకు ఈ సమాచారం ఇచ్చారని అనుమానం కలుగుతుందన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పాసైన వారి,100 మార్కులు దాటిన వారి ఓఎమ్ఆర్ షీట్స్ బయట పెట్టాలన్నారు ఆయన.

డబుల్ బుల్ అయిన ఓఎన్ఆర్ షీట్లు,హాల్ టికెట్లు,వారి వివరాలు వారికి అధికారులు మరియు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు ఏంటో సిట్ విచారణ చేయాలన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఇన్ని రోజులు డాటా ఎందుకు దాచారు. ఇంతకాలం ఎందుకు దాచారు.?
మీ పిఎ కు కూడా నోటీసులు ఇవ్వమని చెప్పండి. ఓఎమ్ఆర్ షీట్లు దాచారని అనుమానంగా ఉందన్నారు ఆయన.

11 నుండి 17 వరకు మధ్య కాలంలో వివరాలు చెరిపేశారని అనుమానం వ్యక్తం చేశారన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. కీలక సమాచారం చెరిపేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. 2016,2022 గ్రూప్ 1 ఓఎమ్ఆర్ షీట్లు భద్రపరుస్తారన్న నమ్మకం లేదన్నారు ఆయన. షమీమ్, రమేష్, సురేష్, వీరిని మేం చెప్పిన తర్వాతనే అరెస్ట్ చేశారు. వారికి 100 మార్కులు దాటినప్పుడు వారెలా డబుల్ బబ్లింగ్ చేస్తారన్నారు ఆయన. వారి ఓఎమ్ఆర్ షీట్లు బయట పెట్టాలన్నారు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

సీజ్ చేసిన కంప్యూటర్లు,ఫోన్లు ఎక్కడికి పంపారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సెంటర్ కు పంపారా లేదా?
స్టేట్ ఫోరెన్సిక్ రిపోర్టు ముఖ్యమంత్రికి ఇస్తారు కాబట్టి విలువైన ఆధారాలు మార్చే ప్రమాదం ఉంటుందన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసులు చేసే విచారణపై హోం మంత్రి ఎందుకు మౌనం. హోం మంత్రి ఎందుకు మీడియా సమావేశం పెట్టడం లేదని నిలదీశారు ఆయన. రాజకీయ నాయకులవి మరియు వంద మార్కులు దాటిన వారి ఫోన్లు కాల్ డాటా తీసి పరిశీలించాలని డిమాండ్ చేశారు ఆయన.

ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్ కు పేపర్ చేరిందంటే.. మనీలాండరింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీకి అప్పగించాలన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సింగరేణిలో కూడా లీకేజి జరిగిందని తెలుస్తుంది. నిరుద్యోగులకు నష్టపరిహారం ఇవ్వాలి. వారిపట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ తప్పించుకోవాలని చూస్తుంది. మళ్లీ పేపర్లు తయారుచేస్తున్నామని పబ్లిక్ సర్వీస్ కమీషన్ అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కమీషన్ చైర్మెన్ సభ్యులను తొలగించే వరకు పరీక్ష నిర్వహించవద్దన్నారు ఆయన.

గ్రూప్ 1 ప్రత్యేక కేసుగా నమోదు చేయాలి. కెటిఆర్ మరియు చైర్మెన్ కు నోటీసులు ఇవ్వాలి. చైర్మెన్ ను ఏ1 నిందితుడిగా చేర్చాలి. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నాం. 2009 పోలీసు ఎస్ఐ ప్రమోషన్లు కోసం 200 మంది ఉన్నారు.వీరు ఏ తప్పు చేయకపోయినా వీరికి ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఒక పౌరుడిగా సిట్ అధికారులకు సహకరిస్తా, నేనే వారికి సహాయం చేస్తాను. బండి సంజయ్ వలే పారిపోను…నోటీసులు ఇస్తే సమాధానం చెప్తాను. ప్రశ్నిస్తే జర్నలిస్టులపై దాడులు చేసి అరెస్టు చేస్తున్నారు. 3గంటలు బంధించి ప్రెస్ మీట్ పెట్టే కెసిఆర్ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రతి పత్రికను ,ఛానల్ ను బెదిరిస్తున్నారు,కొంటున్నారు..డైరెక్ట్ గా అసహనంగా మాట్లాడుతున్నారు,దాడులు కూడా చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking