Take a fresh look at your lifestyle.

మంత్రి గంగుల కమలాకర్ కు పితృవియోగం

0 179

మంత్రి గంగుల కమలాకర్ కు పితృవియోగం.

అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూసిన గంగుల మల్లయ్య.

రాష్ట్ర బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) గారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గారు, బుధవారం కరీంనగర్ లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్ గారు మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు, విచారం వ్యక్తం చేశారు.

తండ్రి ని కోల్పోయిన బాధలో వున్న గంగులను సిఎం కెసిఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking