Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ సహకారంతో  ఇంటింటీకి మేడారం ప్రసాదం

0 18

ఆర్టీసీ సహకారంతో  ఇంటింటీకి మేడారం ప్రసాదం

నిర్దేశం, వరంగల్ :
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర… తెలంగాణ లోనే అతిపెద్ద జాతర. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర. రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజులపాటు కన్నుల పండువగా జరుగుతుందీ గిరిజనుల జాతర. అమ్మవార్ల మహా ప్రసాదం అయితే దక్కితే చాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసం శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జాతరకు వెళ్లలేకపోయిన వారికి కూడా మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసింది టీఎస్‌ఆర్టీసీ.
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు..
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు.. మేడారం జాతర ప్రసాదాన్ని మీ ఇంటి ముందుకే తెచ్చిస్తామంటోంది ఆర్టీసీ. ఇందు కోసం దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తుల ఇళ్ల దగ్గరకే అందజేయనుంది టీఎస్‌ఆర్టీసీ. ఇందు కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ కూడా ప్రారంభించింది. ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. దీంతో నిన్నటి నుంచే ప్రసాదం బుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించింది టీఎస్‌ఆర్టీసీ. ఈనెల 25 వరకు ప్రసాదం బుకింగ్‌ సేవలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్‌లో గానీ ఆఫ్‌లైన్‌లో గాని.. ప్రసాదాన్ని బుక్‌చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే… టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లలో గానీ… పీసీసీ ఏజెంట్ల దగ్గర గానీ.. రూ.299 చెల్లించి మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అయితే… https://rb.gy/q5rj68 లింక్‌పై క్లిక్‌ చేయాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking