Take a fresh look at your lifestyle.

బీఎస్పీలో భారీగా చేరికలు

0 12

బీఎస్పీలో భారీగా చేరికలు

నిర్దేశం, హైదరాబాద్ :బీఎస్పీలో రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి. బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుని పార్టీలో చేరారు. జహీరాబాద్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జంగం గోపి తన అనుచరులతో బీఎస్పీలో చేరారు.

అలాగే మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మాచన్ పల్లి స్వతంత్ర MPTC బోయ స్వప్న శ్రీనివాస్ సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో TRSV రాష్ట్ర కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు అట్టెం రమేష్ ముదిరాజ్ తోపాటు అతని అనుచరులు బీఎస్పీలో చేరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking