Take a fresh look at your lifestyle.

హామిలు మరిచిన ప్రభుత్వంపై ఎన్ని కేసులేయచ్చు..

0 61

గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రభుత్వంపై

హామిలు మరిచిన ప్రభుత్వంపై ఎన్ని కేసులేయచ్చు..

: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్

హైదరాబాద్ : మహిళా గవర్నర్ ను అవమానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదని సుప్రీం కోర్టుకు వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. ఈ మేరకు పత్రికాలకు ప్రకటన విడుదల చేశారు అతను.

• వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. మహిళా గవర్నర్ ను అవమానించడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదం.

• అదే నిజమైతే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న నీపై సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు వేయాలి? రాజ్యాంగంపై ప్రమాణం చేసి అందుకు వ్యవహరిస్తూ ఝూఠా మాటలతో, తల తిక్క నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులపాల్జేయడమే కాకుండా 50 వేల జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా సమాచార హక్కు చట్టం స్పూర్తినే దెబ్బతీస్తున్న నీపై ఎన్ని కేసులు వేయాలి?

• 2014 నుండి మొన్నటి వరకు నీ పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ హైకోర్టు ఎన్నిసార్లు మెట్టికాయలు వేసిందో గుర్తు తెచ్చుకో. సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అనేక మంది అధికారులపై వేల కొద్ది కోర్టు ధిక్కరణ కేసులున్న నువ్వు గవర్నర్ పై సుప్రీంకోర్టుకు వెళ్లడం సిగ్గు చేటు.

• అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో సమన్వయంగా వ్యవహరిస్తున్నట్లు నటించిన కేసీఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కి గవర్నర్ వ్యవస్థను అప్రదిష్టపాల్జేయమే లక్ష్యంగా చర్చలోకి లాగేందుకు కుట్ర చేస్తున్నారు.
• ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి నుండి మహిళలంటేనే అలుసు. మొదటి కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించలేదు. మహిళా కమిషన్ ను నియమించలేదు. మహిళలు వంటింటికే పరిమితం కావాలనే సంకుచిత మనస్తత్వం కేసీఆర్ ది.

• గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు వంగి వంగి పాదాభివందనాలు చేసిన కేసీఆర్ ఉన్నత విద్యావంతురాలైన తమిళసై మహిళ గవర్నర్ గా వచ్చినప్పటి నుండి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు కనీస మర్యాద ఇవ్వాలనే సోయి లేకుండా అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. 80 వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే కేసీఆర్ కు రాష్ట్ర ప్రథమ పౌరురాలిపట్ల ఎలా వ్యవహరించాలో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు.

• అసలు గవర్నర్ చేసిన తప్పేమిటి? క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తే ఆ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడమే నేరమా? ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలను కలవకుండా, ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఫాంహౌజ్, ప్రగతి భవన్ కే పరిమితమైతే గవర్నర్ గా ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి క్రుషి చేయడమే ఆమె చేసిన తప్పా?

• కనీస సౌకర్యాల్లేక కునారిల్లుతున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, వైద్య రంగానికి కాయకల్ప చికిత్స చేసేందుకు తనవంతు ప్రయత్నం చేయడం తప్పా? ముఖ్యమంత్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ రాక్షస పాలన కొనసాగిస్తుంటే…. ప్రజా సమస్యల పరిష్కారానికి యత్నిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్న గవర్నర్ తమిళసై అంటే కేసీఆర్ కు కడుపు మంట.

• పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం నాడు నిబంధనల ప్రకారం జరగాల్సిన ప్రోటోకాల్ ను కూడా పాటించకుండా గవర్నర్ ను పదేపదే అవమానపరుస్తున్నారు. జిల్లా పర్యటనలకు వెళితే కనీసం కలెక్టర్ స్థాయి అధికారులను పంపించకుండా అవమానించారు. గవర్నర్ సమన్వయంతో వ్యవహరించాల్సిన మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ రాజ్యాంగ వ్యవస్థను కించపర్చడం ఎంతవరకు సమంజసం?

• గవర్నర్ వ్యవస్థపట్ల నీ సంకుచిత ధోరణిని, అహంకారపూరిత విధానాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో ఇదే విషయంపై హైకోర్టుకు వెళితే ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. దేశ అత్యున్నత న్యాయ స్థానంలోనూ మీకు మరోసారి చుక్కెదురు కావడం ఖాయం. నీ వింత చేష్టలు, విచిత్ర నిర్ణయాలు, రాక్షస విధానాలను రాష్ట్రమంతా గమనిస్తోంది. ప్రజా కోర్టులోనూ నీకు శిక్ష పడటం తథ్యం.

Leave A Reply

Your email address will not be published.

Breaking