Take a fresh look at your lifestyle.

బడా దర్శకుడితో రియా మాస్టర్ ప్లాన్.. నోట్ల కట్టలు కుమ్మరించి!! సుశాంత్ సూసైడ్ కేసులో కొత్త కోణం

0 457

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు సాగుతుండగా.. సుశాంత్ ప్రేయసికి సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ సూసైడ్ చేసుకొని రెండు నెలలు దాటినా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సూసైడ్ మిస్టరీలో ఇప్పటికే సుశాంత్‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తీర్పు మేరకు సీబీఐ రంగంలోకి దిగి కేసు విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ పరిస్థితుల్లో ఎలాగైనా తనపై అపవాదు రాకుండా చూసుకోవాలని రియా ప్రయత్నాలు చేస్తున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.

ఈ మేరకు ఓ బడా దర్శకుడితో కలిసి రియా మాస్టర్ ప్లాన్ వేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసు విషయమై జనాల్లో తనపై ఓ తప్పుడు అభిప్రాయం ఉందని గ్రహించిన రియా.. ఓ దర్శకుడి సహాయంతో ప్రముఖ జర్నలిస్టుతో భారీ డీల్ కుదుర్చుకుందని వార్తలు వెలువడుతున్నాయి. జనాల్లో తనపై పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని ఆ జర్నలిస్టును కోరిన ఆమె, అందుకోసం నోట్ల కట్టలు కుమ్మరించిందని అంటున్నారు. వెనుక నుంచి రియా PR టీమ్ ఈ కథ అంతా నడిపిస్తున్నారని టాక్.

ఈ స్కెచ్‌లో భాగంగానే రీసెంట్‌గా వాట్సాప్ చాట్ బయటపెట్టి ఆ దర్శకుడికి, తనకు మధ్య తండ్రీ కూతుళ్ళ రిలేషన్‌షిప్ ఉన్నట్లుగా తెలిపారని అంటున్నారు. రియానే స్వయంగా ఈ చాట్ సదరు జర్నలిస్టుకు ఇచ్చి మీడియాలో వచ్చేలా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్ సూసైడ్ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సో.. చూడాలి మరి ఈ కేసుకు ఎలాంటి ముగింపు లభిస్తుంది? దోషులుగా ఎవరైనా తేలుతారా? లేదా? అనేది.

Leave A Reply

Your email address will not be published.

Breaking