Take a fresh look at your lifestyle.

ట్రాఫిక్ రూల్స్ పై అవగహన పెంచే ఐడియా సాగర్ కు సెల్యూట్ చెబుదాం..

0 18

ట్రాఫిక్ రూల్స్ పై అవగహన కల్పించడమే ఐడియా సాగర్ ఆశయం

ఐడియా సాగర్ అంటే ఆర్మూర్ ప్రాంతంలో అందరికి పరిచయమైన పేరు. ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిస్తే బాధ పడుతాడు అతను. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన సాగర్ కు ట్రాఫిక్ రూల్స్ పై ఎంతో అవగహన.. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోతే ప్రాణాలు పోతాయని వెహికిల్ ఆపి మరీ చెబుతారు అతను. నలుగురు కలిస్తే చాలు ట్రాఫిక్ రూల్స్ పై క్లాస్ ఇస్తాడు.

ఆరువై ఏళ్లు దాటినా ఇంకా యంగ్ భాయ్ లా యాక్టివ్ గా ఉంటాడు. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ అవగహన సభలకు ముఖ్యఅతిథిగా వెళ్లిన సాగర్  డ్రైవర్ లకు ట్రాఫిక్ రూల్స్ పై గంటల తరబడి క్లాస్ లు చెబుతాడు.

ఇగో.. యమధర్మరాజు వేషాదరణతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్న ఇద్దరు యువకులకు క్లాస్ ఇస్తుంది విద్యా సాగర్.

కోట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం ఒక్కటే.. ట్రాఫిక్ రూల్స్ పాటించక పోతే ఆ ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని బాధ పడుతాడు ఐడియా సాగర్.. ఆర్మూర్ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధర్యంలో ఏర్పాటు చేసే ఉచిత ఆరోగ్య శిభిరాలలో ముందుండి పని చేస్తారు విద్యా సాగర్.

స్వార్థంతో నిండి పోయిన ఈ సమాజంలో ట్రాఫిక్ రూల్స్ పై అవగహన కల్పిస్తున్న ఐడియా సాగర్ కు సెల్యూట్ చెబుదాం..

  • యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking