Take a fresh look at your lifestyle.

భావ ప్రకటన హక్కును కాపాడుకుందాం

0 169

భావ ప్రకటన హక్కును కాపాడుకుందాం

భిన్నాభిప్రాయ విలువలను నిలబెట్టుకుందాం

స్వేచ్ఛ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా మానవహారం

మతోన్మాద మూక దాడులను నిరసిస్తూ 23 జనవరి 2023న  ప్రజాసంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రమంతా మానవహారం కార్యక్రమం నిర్వహించారు.

దేశంలో పెరుగుతున్న మూక దాడులను మతోన్మాద కుల ఉన్మాద దాడులు అరికట్టాలని రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం అని ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం రాష్ట్ర నాయకురాలు రమాదేవి సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నున్న అప్పారావు ఎం సి పి ఐ యు జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు సూదమల్ల భాస్కర్ ఆర్ఎస్పీ పార్టీ నాయకులు వల్లందాస్ కుమార్ లు మాట్లాడారు

దేశంలో గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా రాజ్యాంగపరమైన ప్రజాస్వామికిపరమైన హక్కులు హరించబడుతున్నాయని వారు అన్నారు. ప్రజాస్వామ్య చైతన్యం ద్వారా సాధించుకున్న హక్కులు రాజ్యాంగపరంగా ఏర్పడి మళ్ళీ ఆ హక్కులను దేశాన్ని పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తున్నాయని వారు అన్నారు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే నేరంగా భావించి అక్రమ కేసులు, బనయించడమే కాక మూక దాడులు చేస్తున్నాయని వారు అన్నారు.

ప్రజాస్వామికవాదులు కలబుర్గి గౌరీ లంకేష్ హత్యలు ఈ ఈ కోవలోకే వస్తాయని ఇలాంటి మధ్యయుగాల అనాగరిక విధానం ను వ్యతిరేకిస్తూ రాజ్యాంగపర మరియు ప్రజాస్వామిక హక్కులను కాపాడుకొనుటకు ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని వారు అన్నారు టీచర్లు అంబేద్క రి స్టులు భౌతిక వాదులు నాస్తిక హేతువాదులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి బాసూమియా నాయకులు బుస్సా రవీందర్ లక్ష్మణ్, లు సిపిఎం నాయకులు మాలోత్ సాగర్ యాదగిరి బషీర్ హెచ్ఆర్ఎఫ్ నాయకులు వెంకటనారాయణ కేవీపీఎస్ నాయకులు ఆరూరి కుమార్ డి హెచ్ పి ఎస్ నాయకులు సంఘీ ఎలేందర్ సి ఎం ఎస్ జిల్లా కార్యదర్శి రమ లతోపాటు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చివరగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రాచర్ల బాలరాజు వందన సమర్పణ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking