Take a fresh look at your lifestyle.

లక్కంపల్లి సెజ్ ను పట్టించుకోని ప్రభుత్వం : రేవంత్ రెడ్డి 

0 398

లక్కంపల్లి సెజ్ ను పట్టించుకోని ప్రభుత్వం

: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 

నిజామాబాద్, మార్చి 17 : 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసిందన్నారు ఆయన.  ఇందులో పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 బీజేపీ ప్రభుత్వం చెప్పింది. కానీ పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందన్నారు ఆయన. 

ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారన్నారు ఆయన. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే బెదిరించారన్నారు ఆయన.

టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు ఆయన. నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని ఆవేధన వ్యక్త ం చేశారు.

కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదు. అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు 30శాతం కప్పం కట్టాల్సిందేనట.

అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించండి. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలి. గతంలో పతంజలి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కవిత పెద్ద ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. రాందేవ్ బాబాతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి ఎంపీ కృషి చేయాలి. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలన్నారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking