Take a fresh look at your lifestyle.

శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం  

0 56

 శ్రీశైలంలో కుంభోత్సవం

శ్రీశైలం, ఏప్రిల్ 11 (వైడ్ న్యూస్) మంగళవారం  శ్రీశైల క్షేత్రంలో లోక కల్యాణార్థం శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం  నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు నిమ్మకాయలు సాత్విక బలి గా సమర్పిస్తారు అలాగే కుంభహారతి మరియు అమ్మవారికి పలురకాల వంటలతో మహానివేదన సమర్పిస్తారు . దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతువులు పక్షులు బలులును పూర్తిగా నిషేధించారు.

ఆలయ సిబ్బంది స్థానిక రెవెన్యూ పోలీసు శాఖల సహకారంతో జంతు పక్షి బలి జరగకుండా పర్యవేక్షించాలని ఈవో లవన్న ఆదేశించారు. అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి  కల్యాణోత్సవం ,ఏకాంత సేవ నిలుపుదల చేశారు.

తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. తరువాత రెండో విడత సాత్మిక బలి సమర్పించబడుతుంది.చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండివంటలతో అమ్మవారికి మహానివేదన చేయడం జరుగుతుంది. కాగా ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామదేవత అంకాళమ్మకు కూడా ఈ ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking