Take a fresh look at your lifestyle.

ఖమ్మం జిల్లా పోలీసు అధికారుల పని తీరు భేష్ : డిజిపీ

0 95

ఖమ్మం జిల్లా పోలీసు అధికారుల పని తీరు భేష్

: తెలంగాణ డిజిపి అంజనీ కుమార్

ఖమ్మం లో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా ఖమ్మం చెందిన పోలీస్ అధికారులు అత్యంత అద్భుతంగా తమ పనితీరును కనబరిచారని ప్రశంసించారు.

అయితే ఏ ఒక్క జిల్లాను మరో జిల్లాలనుంచి పోల్చుకోలేమని, దేనికి దాని ప్రత్యేకమైన యూనిట్ ఉంటుంది.

ఆ జిల్లాకు సంబంధించిన బలాలు, బలహీనతలు అక్కడి పోలీస్ యూనిట్ ఉన్నత అధికారులకు తప్పక తెలుస్తుంది.

పోలీస్ శాఖలో ఓ యూనిట్ నుంచి మరో యూనిట్ మధ్యలో పోటీ తత్వం ఉండకూడదు.

తమ యూనిట్ పరిధిలోని కష్టనష్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు శాంతి భద్రత ఎటువంటి విఘాతం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలి.

నూతనంగా ఐపీఎస్ అధికారులుగా నియమితులైన అధికారులు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతున్నారు.

ఐజీలు కూడా తమ పరిధిలోని యూనిట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారని డీజీపీ అన్నారు.

పోలీస్ యూనిట్ల మధ్య ఉండాల్సింది పోటీతత్వం కాదని, ఐక్యమత్యం ఉండాలన్నారు.

ఇదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలోని పోలీసు యూనిట్లు సమిష్టిగా పనిచేస్తూ, అద్భుతమైన పనితీరుని కనబరుస్తారన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking