Take a fresh look at your lifestyle.

కవితను ఈడీ నుండి కాపాడడానికి కెసిఆర్ కుట్ర : బిఎస్ పి

0 13

కవితను ఈడీ నుండి కాపాడడానికి కెసిఆర్ కుట్ర.

వన్ నేషన్ వన్ మిల్క్ కుట్రలో అమిత్ షాతో కలిసిన కెసిఆర్.

తెలంగాణలో దోపిడీ,దుష్ట,నిరంకుశ పాలన నడుస్తుంది.

ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేయాలి.

కెటిఆర్ కు ట్వీట్లు చేయడం ఒక్కటే తెలుసు.

హైదరాబాద్, మే 10 : 2013లో తెలంగాణ వస్తే సమ్మెలు ఉండవన్న కెసిఆర్, ఇపుడు ఉద్యోగులపై నిరంకుశ వైఖరిని అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జెపి ఎస్ లను ప్రభుత్వం ఉగ్రవాదులు తీవ్రవాదులుగా చూస్తున్నది. 2018లో మూడు సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని నోటిఫికేషన్ లో హామీ ఇస్తేనే 9600 మంది ఉద్యోగంలో చేరారు.

ప్రభుత్వం 3సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేయకుండా, దానికోస కమిటీ వేయకుండా క్యాడర్ స్ట్రెంత్ నిర్దారించకుండా అక్రమంగా మరో ఏడాది ప్రొహిబిషన్  పెంచడం దారుణమన్నారు ఆయన. జెపిఎస్ లు రోడ్లపైకి వచ్చి సమ్మెలు చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినా, ప్రభుత్వం మాత్రం విఆర్ఏలు, ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వంటి ఉద్యోగుల మీద ఎలాగైతే ఉక్కుపాదం మోపారో, జెపిఎస్ లమీద కూడా ఉక్కుపాదం మోపి అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ కుమార్.

కెటిఆర్ కు ట్వీట్లు మాత్రమే తెలుసు

కెటిఆర్ కు ట్వీట్లు మాత్రమే తెలుసు తప్ప,సమస్యలు పరిష్కరించడం తెలియని ధ్వజమెత్తారు బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భారత రాజ్యాంగం ప్రతి ఉద్యోగికి, పౌరునికి జీవించే హక్కును కల్పించింది. వెటటిచాకిరిని నిషేదించింది. కానీ నేటి ప్రభుత్వం జెపిఎస్ లతో వెట్టిచాకిరి చేయుంచుకుంటున్నారని ఆరోపించారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి అగ్రిమెంట్ రాసిచ్చారు కాబట్టి మీరు కోర్టుకు వెళ్లినా చెల్లదు అంటున్నారు. ముందు ఎర్రబెల్లిని మంత్రి పదవి నుంచి తీసెయ్యాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో రాజ్యాంగబద్దంగా చట్టాలను లోబడి సేవ చేస్తానని ప్రమాణం చేసి ఇపుడు చట్టాలకు విరుద్దంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కెటిఆర్ అయితే పవిత్ర హృదయంతో అసెంబ్లీలో ప్రమాణం చేశారు. కానీ నేడు దుష్ట, దుర్మార్గ ఆలోచనలతో ఉద్యోగులను కష్టపెడుతున్నారన్నారు ఆయన. ఎవరిని ఉద్యోగం నుండి తొలగించినా బిఎస్పి ఊరుకోదు. సెక్రటరీలను కాపాడుకుంటుంది. సర్పంచ్ లు,రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వీరికి తోడుగా ఉంటామన్నారు ప్రవీణ్ కుమార్.

గత నెల ఏప్రిల్ 28న హైకోర్టులో సమత రేప్ అండ్ మర్డర్ కేసులో హైకోర్టు నిందితుల ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇది చాలా బాధాకరం. నిర్భయ కేసులో ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష పడింది. దిశ కేసులో కూడా నిందితులు ఎన్ కౌంటర్ కు గురై చనిపోయారు. కానీ సమత కేసులో మాత్రం, దారుణంగా అత్యాచారం హత్య చేసిన ఘటనలో లింగాపూర్, ఆసిఫాబాద్ పోలీసులు నిందితులను దొరకబట్టి లోయర్ కోర్టు  ఉరి శిక్ష వేసిందన్నారు ఆయన.

కానీ ఆరు సంవత్సరాల తర్వాత ఈ కేసు రేపేస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదని హైకోర్టు పేర్కొనడం అన్యాయం. బాధితురాలు సామాన్య పేద కులానికి చెందిన వారు కాబట్టే ఇలా జరిగింది. బాధితురాలు బేడ బుడగ జంగాల కులానికి చెందిన మహిళ కాబట్టే ఇలా జరిగింది. దిశ హత్య సమయంలో అన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి, కానీ సమత విషయంలో మాత్రం సభ్య సమాజం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కులానికి చెందిన అణగారిన కులాల మహిళలను దారుణంగా చంపితే ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని, ఎవరూ లేని సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను అత్యాచారం చేసి చంపితే ఉరిశిక్ష వేయాలని సుప్రీంకోర్టు పేర్కొన్నదని గుర్తు చేశారు ప్రవీణ్ కుమార్.

పేద, అణగారిన వర్గాల కోసం ఏర్పాటైన బిఎస్పి దీనిపై పోరాడుతుందన్నారు ఆయన. బిఆర్ఎస్ ప్రభుత్వం షీ టీమ్స్, అంబేడ్కర్ విగ్రహం పెట్టామని చెబుతుంది కానీ సమత కేసులో పట్టించుకోవడం లేదని విమర్శించారు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో 79 శాతం ఆధిపత్య వర్గాల న్యాయవాదులు ఉన్నారన్నారు ఆయన. అందుకే ఇలాంటి పరిస్థితి. కాబట్టి కోర్టుల్లో అన్ని వర్గాల ప్రజలతో నియామకం జరపాలన్నారు ఆయన.

బిఆర్ఎస్ పార్టీ ,బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు నటిస్తోంది. కానీ సిఎం సొంత నియోజకవర్గంలోని వర్గల్ మండలంలో గుజరాత్ కు చెందిన అమూల్ ఫ్యాక్టరీని  500  కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఒకపక్క 1500 మంది ఉద్యోగులతో 700 కోట్ల టర్నోవర్ తో పాడి రైతులను రక్షిస్తుంటే విజయ డెయిరీ ని నాశనం చేస్తుంది. మోడీ బిఎస్ఎన్ఎల్ ను నాశనం చేసి, జియో, ఎయిర్ టెల్ ను తీసుకొచ్చినట్లు, కెసిఆర్ విజయ, మదర్ డెయిరీలను నాశనం చేసేందుకు అమూల్ కంపెనీని తీసుకొచ్చారు. పాడిరైతుల పొట్ట కొడుతున్నారు, వారి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు  ప్రవీణ్ కుమార్.

కో ఆపరేషన్ అమిత్ షా ఆదేశాల మేరకే అమూల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారన్నారు ఆయన. కవితను ఈడీ నుండి  కాపాడుకోడానికి, సొంత ప్రయోజనాల కోసం కెసిఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు ప్రవీణ్ కుమార్. కర్ణాటకలో పాడి రైతులు నందిని మిల్క్ ను కాపాడుకోడానికి, అమూల్ కంపెనీని వ్యతిరేకిస్తుంటే, కేరళ కూడా అమూల్ వద్దంటుంటే తెలంగాణ పట్టించుకోవడం లేదన్నారు ఆయన. కరీంనగర్ డెయిరీ, ములకనూర్ వంటి స్థానిక సంస్థలను కాపాడుకోడానికి ప్రయత్నించాల్సింది పోయి, గుజరాత్ కంపెనీలకు కెసిఆర్,కెటిఆర్ లు తెలంగాణ ఆస్తిని కట్టబెడుతున్నారు. తెలంగాణ స్థానిక పాల కంపెనీలను అమూల్ లో కలిపే కుట్రగా పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking