Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో బ్యూటీ క్లినిక్ లపై అధికారుల దాడులు

0 14

హైదరాబాద్ బ్యూటీ క్లినిక్ లపై వైద్య బృందం దాడులు

అనుమతులు లేని క్లినిక్ లకు నోటీసులు

హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో దీప్తి పర్మినెంట్ మేకాప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్ లోని వీ – స్పార్క్ వెల్ నెస్ క్లీనిక్ లపై రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వో ఆధ్వర్యంలో వైద్యుల బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ప్రభుత్వ అనుమతి (లైసెన్స్ ) లేకుండా మరియు అర్హులైన డెర్మటా లీజిస్ట్ లేకుండా స్కిన్ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లుగా తేలింది.

అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా డ్రగ్స్ లైసెన్స్ లేకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నారని వైద్య బృందం గుర్తించింది.  ఈ సందర్భంగా రంగారెడ్డి DMHO వెంకటేశ్వర్లు గారు దీప్తి పర్మినెంట్ మేకాప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్ లోని వీ – స్పార్క్ వెల్ నెస్ క్లీనిక్ లకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, సరియైన డాక్టర్ లు లేకుండా కొనసాగే క్లీనిక్ లను ప్రజలు గుర్తించి వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు వెంకటేశ్వర్లు.

– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking