Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు జైలు కూడు తప్పదా..?

కేసీఆర్ చుట్టూ బిగిస్తున్న ఫోన్ ట్యాపింగ్.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులు..

0 2,472

కేసీఆర్ కు అవినీతి మరకలు

  • కేసీఆర్ కు జైలు తప్పదా
  • ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ
  • ఢిల్లీ లిక్కర్ స్కాం లోనూ కేసీఆర్
  • బీఆర్ ఎస్ భవిష్యత్..?

(యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్)

కేసీఆర్.. ఈ పేరు వినగానే తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపించేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అతను పిలునిస్తే రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలోకి నేను సైతం అంటూ దూసుకెళ్లేవారు జనం.

కానీ.. పదేళ్లు సీఎంగా కొనసాగిన కేసీఆర్ ను అవినీతి మరకలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ కోసమేనా..? అనే టాక్ జోర్ గా వినిపించింది. అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం.. రాజకీయంగా లాభ పడటం కోసం చట్ట విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలతో కేసీఆర్ నిండ మునిగి పోయారు.

కేసీఆర్ కు జైలు తప్పదా..?

కేసీఆర్ కు జైలు తప్పదా..? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తున్న టాక్.. ఒకప్పుడు అతను ఏది చేసినా ప్రశ్నించేవారు లేరు. కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటుతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. దేశంలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో కేసీఆర్ పాత్ర కీలకంగా కనిపించడంతో అన్ని వర్గాలు అసహించుకుంటున్నాయి. హైకోర్టు జడ్జీలు సైతం ఫోన్ ట్యాపింగ్ బాధితులు కావడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉన్న పోలీసు అధికారులను అరెస్టు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ..?  

ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్షలు, బిజినెస్ మెన్ లు, పత్రికా ఎడిటర్ లు, జడ్జీలు, సొంత బీఆర్ ఎస్ పార్టీ నేతలు సైతం ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు కావడంతో సీబీఐతో విచారణ జరిపించి కేసీఆర్ కు శిక్ష పడేలా చూడాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కేసీఆర్..

కేసీఆర్ పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపించడంతో తెలంగాణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మొదటి నుంచి కేసీఆర్ కు తెలిసీ తన కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిందని ఈడీ అధికారులు ఆరోపించడంతో ఈ ఆంశం చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ అరెస్టు తప్పదని భావిస్తున్న తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని విశ్వాషనీయ వర్గాల ద్వారా తెలిసింది.మాటలతో మాయ చేసి ముందు చూపుతో రాజకీయాలు నడిపించే కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ఏమిటో ఎదురు చూడాల్సిందే..?

Leave A Reply

Your email address will not be published.

Breaking