Take a fresh look at your lifestyle.

అతను పోలీసుకులకు ఫోన్ ఎందుకు చేశాడంటే…?

కుక్కను ఇంట్లో నుంచి తరిమి కొట్టడానికి..

0 24

అతను పోలీసుకులకు ఫోన్ ఎందుకు చేశాడంటే…?

కుక్క… ఈ పేరు వినగానే భయంతో వణికి పోయేవారుంటారు. ఆ కుక్క అనుకోకుండా కరిస్తే ఇంజక్షన్ లు తీసుకోవడం పెద్ద సమస్యగా  భావించే వారున్నారు. కానీ.. వరంగల్‌లో ఒకరు పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్క ఎంతకు బయటికి వెళ్ళక పోవడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు.

ఆ కుక్కను పోలీసులతో బయటకు వెళ్ళగొట్టించాడు రాజేంద్రకుమార్. ఈ విచిత్ర సంఘటన ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో జరిగింది.  ఇంటి యజమాని రాజేంద్రకుమార్ నిర్వాకం చూసిన పోలీసులు బిత్తరపోయారు. ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడితే సహజంగా కర్ర పట్టుకొని బెదిరిస్తాం. ఏదో ఒక విధంగా ఆ కుక్కను భయపెట్టించి బయటకు వెళ్లగొడతాం.

కానీ వరంగల్ గిర్మాజీపేటకు చెందిన రాజేంద్రకుమార్ అనే వ్యక్తి మాత్రం తన ఇంట్లోకి చొరబడ్డ కుక్కని వెళ్ళగొట్టడం కోసం డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్క ఎంతకు బయటికి వెళ్లడం లేదని, తరిమితే పైపైకి వచ్చి కరిచేందుకు యత్నిస్తోంది. మీరే వెళ్లగొట్టాలంటూ పోలీసులకు సూచించడం ఇప్పుడు ఓరుగల్లు హాట్ టాపిక్ అయింది. పాపం పోలీసులు అంటూ సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యనిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking