Take a fresh look at your lifestyle.

కల్వకుంట్ల కవిత కాలు ఫ్రాక్చర్

0 86

కల్వకుంట్ల కవిత కాలు ఫ్రాక్చర్

మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యుల సలహా

హైదరాబాద్‌, ఏప్రిల్ 11 (వైడ్ న్యూస్)  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. నడువాలేని పరిస్థితిలో ఉన్నట్లు తాను స్వయంగా ఈ  విషయాన్ని ఆమె  ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

కాలికి ఫ్రాక్చర్ అయినందు వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని కవిత తెలిపారు. అందుకే కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు చెప్పారు.

అయితే తన కార్యాలయం మాత్రం అందుబాటులో ఉంటుందని, ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన ఆఫీస్‌ను సంప్రదించవచ్చని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

అయితే ఎలా గాయపడ్డారనే విషయాన్ని మాత్రం కవిత వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం కవిత కాలు గాయంపై వివిధ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking