Take a fresh look at your lifestyle.

పార్లమెంటులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

0 142

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా 

ఢిల్లీ, మార్చి 29 (వైడ్ న్యూస్) టిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి ఆవిర్భావ వేడుకలపై హర్షం వ్యక్తం చేసారు ఆయన. పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల. కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు అందజేసిన టిడిపి ఎంపీలు.

ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న జెపి నడ్డా టిడిపి ఎంపీలకు అభినందనలను తెలియజేసారు. వాజ్ పేయి, ఎన్ డి ఏ హయాంలో టిడిపి- బిజెపి అనుబంధాన్ని జెపి నడ్డాకు వివరించారు ఎంపీ కనకమేడల.  టిడిపితో స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసన్నారు  జెపి నడ్డా. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపైనా ట్వీట్ చేసిన జెపి నడ్డా.
టిడిపి బిజెపి అభ్యర్ధుల విజయం పైనా ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేసారు ఆయన.

Leave A Reply

Your email address will not be published.

Breaking