Take a fresh look at your lifestyle.

కామ్రేడ్ గద్దర్ అన్నకు జైభీం లాల్ సలాంలు..

0 13

గద్దర్ తరగని విప్లవ గని

కామ్రేడ్ గద్దర్ అన్నకు జైభీం లాల్ సలాంలు..

వీరుడు మరణించడు
విప్లవం మరణించదు
ఈ మాటలను ప్రతి విప్లవకారుడి అమరత్వం సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం పిడికిలి ఎత్తిపట్టి చెప్పే మాటలు.

ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు.
చరిత్ర పొడువున కత్తుల వంతెనపై నిలబడి తన జాతి శ్రమ విముక్తి కోసం బలిదానాలకు సైతం వెర్వకుండా దృఢంగా, చివరి శ్వాస విడిచే వరకు పోరు సల్పిన యోధుల చరిత్ర ఇదే.
ఆ యోధుల వారసత్వాన్ని భుజాలపై మోయడమే
విప్లవ సైద్ధాంతిక అమరత్వం,
భావి తరాలకు బాటలు వేస్తుందని మానవ చరిత్ర చెప్పిన సత్యం.

మనిషికి మరణం తప్పదు అది ప్రకృతి సహజ సిద్ధమైనది.
మానవ జాతి చరిత్రలో త్యాగం లేకుండా
ఏ నూతన సమాజం ఆవిర్భావించిన దాఖలాలు లేవు.
తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే భారతదేశంలో సోషలిస్టు విప్లవం సిద్ధిస్తుందనే విశ్వాసంతో దశాబ్దాలపాటు నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఊరిని కనిపెంచిన తల్లిదండ్రులను, తోబుట్టువులు, చిన్న నాటి స్నేహితులు,
తన జీవిత భాగస్వామిని లోకం పోకడ తెలియని పుట్టిన ముగ్గురు చిన్న పిల్లలను వదిలి అజ్ఞాతవాస
జీవితం గడిపిన ప్రజా యుద్ధనౌక గద్దర్ తరగని విప్లవ సైద్ధాంతిక గని.
సందర్భం గద్దర్ అన్న మరణం కావచ్చు కానీ ప్రతి విప్లవకారుడి జీవితం ఇదే.
ప్రస్తుత భారతీయ సామాజిక విప్లవ దశలో విప్లవకారుడిగా ప్రజల కోసం ప్రజల మద్య జీవించడం అంత సులభం కాదు.

అందులోనూ భారతదేశంలో మనువాద పెట్టుబడిదారీ కుట్ర సిద్ధాంత కార్పోరేట్ ఆర్థిక విధానాలు అమలవుతున్న కాలంలో సామాజిక విప్లవకారుడి మరింత కష్టతరమైనది.

1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు జరిపిన కాల్పుల్లో కొన్ని తూటాలను తొలగించారు కానీ ఒక్క తూటా మాత్రం డాక్టర్ లు తొలగించలేదు.
అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు.
కామ్రేడ్ గద్దర్ అన్న పై కాల్పుల జరిగినప్పుడు
మొట్టమొదటిగా స్పందించిన వారు కామ్రేడ్ మారోజు వీరన్న కాల్పుల సంఘటన పిరికి చర్యగా అభివర్ణిస్తూ ఆ సందర్భంగా ఒక పోస్టర్ ను విడుదల చేసారు కామ్రేడ్ మారోజు వీరన్న.
కఠోరమైన అజ్ఞాతవాస జీవితాన్ని వదిలి
మార్క్సిజం – అంబేడ్కరిజాన్ని ఈ దేశ సామాజిక
జీవన విధానానికి అన్వయింపుతో భారతీయ సమాజానికి కొత్త తొవ్వను పరిచయం చేసే ప్రయత్నంలో అమరత్వం పొందారు.
కామ్రేడ్ గద్దర్ అన్న వదిలిపెట్టిన తొవ్వను (దారిని)మరింత ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను నీల్ లాల్ శక్తుల భుజస్కంధాలపై ఉంది.

ఈ దేశంలో సామాజిక ,ఆర్థిక,రాజకీయ, సాంస్కృతిక అన్యాయానికి గురవుతున్న జాతులకు, వివిధ తెగలకు సామాజక న్యాయంతో కూడిన
బహుజన శ్రామిక వర్గ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం దక్కాలనే దృక్పథంతో కూడిన పని ప్రారంభించారు కామ్రేడ్ గద్దర్ అన్న.

ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ పోరాట పంథా మార్చుకుని బ్యాలెట్ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విలువ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత గుర్తించి అందుకు అనుగుణంగా తెలంగాణ పీపుల్స్ రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ కోసం భారత ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా భారతదేశంలో సామాజిక మార్పుకోసం పోరాటాలు చేసే శక్తులు గుర్తించే విషయం ఏమిటంటే…
మార్క్సిస్టు -లెనినిస్టులైనా , మార్క్సిస్టులైనా,
అంబేడ్కరిస్టులైనా ప్రజాస్వామ్యవాదులైనా
అసలు విషయం వదిలేసి పనిచేస్తున్న వాళ్ళమే.

చివరి దశలో కామ్రేడ్ గద్దర్ అన్న చేసిన ప్రయత్నమే
మార్క్సిజం – అంబేడ్కరిజం జమిలి సైద్ధాంతిక పునాదులపై నిర్మాణ ప్రయత్నం.

ఇక ప్రజా సాంస్కృతిక సైద్ధాంతిక రంగం
ఉన్నంత కాలం కామ్రేడ్ గద్దర్ అన్న శ్రమజీవుల ఆటపాటల్లో జీవించే ఉంటారని తెలియజేస్తూ…

జైభీం లాల్ సలాంలతో…

  • దండి వెంకట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
    బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి, తెలంగాణ రాష్ట్ర, కమిటి హైదరాబాద్.

Leave A Reply

Your email address will not be published.

Breaking