Take a fresh look at your lifestyle.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ్యూట్ మోడ్ లో పడ్డారా ..?

0 326

సౌండ్ లేని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి & టీం ..

ధిక్కారస్వరం వినిపించి తప్పు చేసానా అనే భావన ..?

బిఆర్ఎస్ తో ఉంటేనే పోయేది ..?

కేసిఆర్ నిర్ణయం కరెక్టే..!

ఖమ్మం మాజీ యంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరులు సౌండ్ చేయడం లేదు.

మీడియా సైతం శ్రీనివాస్ రెడ్డి వైపు అంతగా ఫోకస్ పెట్టడం లేదు.

శ్రీనివాస్ రెడ్డి సైతం తాను ధిక్కార స్వరం వినిపించి తప్పు చేసాననే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆయన ఫాలోవర్స్ అధిక శాతం యూ టర్న్ తీసుకొని బిఆర్ఎస్ వైపుకు మళ్లారు.

శ్రీనివాస్ రెడ్డి తో ఉంటే తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి సంధర్భంగా అందుబాటులో ఉంటానని తన అనుకూల వర్గాలతో ఎంత ప్రచారం చేసిన కాని ఆయనను ప్రత్యేకించి వెళ్లి కలిసిన వారు అత్యల్పులే.

శ్రీనివాస్ రెడ్డి గ్రూపు రాజకీయాల కారణంగా తమ పార్టీ మెజారిటీ స్థానాలు ఓడిపోవాల్సి వచ్చిందని ఆగ్రహించిన ముఖ్యమంత్రి కేసిఆర్ శ్రీనివాస్ రెడ్డి దూరం పెట్టిన విషయంలో శ్రీనివాస్ రెడ్డి అభిమానులు తప్పా మెజారిటీ ప్రజలు హర్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బిజేపి పునాదులు లేని ఖమ్మంలో పార్టీ నిర్మాణం చేపట్టాలనుకోవడమనేది అంతా భ్రాంతిగా మారే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.

శ్రీనివాస్ రెడ్డి ఫాలోవర్స్ ఒక్కరు కూడా ఎన్నికల్లో విజయం సాధించలేదు. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి బలం ఏ స్థాయి కలిగిందో అర్ధం చేసుకోవచ్చు.

దారి చూపిన తుమ్మల పతనం కోరడమే శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రధాన తప్పుగా అభివర్ణిస్తున్నారు.

ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న తొలి సభలో శ్రీనివాస్ రెడ్డి లేకున్న కాని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు.

శ్రీనివాస్ రెడ్డితో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా పెద్దగా ఫాలోయింగ్ ఉన్న నేతలు కాదు.

ఒకరి పై సెంట్రల్ బ్యాంక్ కేసు పెండింగులో ఉంది. మరొకరి పై ఆదివాసీ నియోజక వర్గంలో పెత్తనం చేయబోయి దేహ శుధ్ది చేయించుకున్న చరిత్ర ఉన్నది.

మరి కొందరికి నిధులు దుర్వినియోగంతో పాటు వక్ర మార్గంలో మళ్లించిన ఆరోపణలున్నాయి.

ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షలు దోచుకున్న వారితో సహా ఇలా అనేక రకాల నేర చరిత్ర కలిగిన వారు శ్రీనివాస్ రెడ్డితో జత కట్టి ఉండటం కూడా ప్రధాన మైనస్ గా చెబుతున్నారు.

వీళ్లను నమ్ముకొని శ్రీనివాస్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డిని నమ్ముకొని వీళ్లు రాజకీయాల్లో రాణిస్తామనుకోవడం పగటి కలగా మారే అవకాశం లేకపోలేదు.

శ్రీనివాస్ రెడ్డి తో కలిసి గతంలో రాజకీయం ప్రారంభించిన వారు ఇప్పుడు అనేక మంది అస్తమయం అయ్యారు.

అభివృద్ధిని కాకుండా కేవలం డబ్బుతో చేసే రాజకీయం ఎక్కువ రోజులు మనుగడ సాగించే అవకాశం లేదని అభివర్ణిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదోక చోట నుంచి బిఆర్ఎస్ నుంచి పోటి చేయకుండా పెత్తనం కోరి తప్పుచేసాననే భావనలో ఉన్నట్లు సమాచారం.

రానున్న కాలంలో చైతన్యానికి మారు పేరైన ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పు మతోన్మాదం వైపా లేకా మానవత్వం వైపా అనేది తేలనుంది.

  • యాటకర్ల మల్లేష్

Leave A Reply

Your email address will not be published.

Breaking