Take a fresh look at your lifestyle.

యోగాసనాలతో ఎన్నో లాభాలు

0 12

జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం

యోగాసనాలతో ఎన్నో లాభాలు

యోగా అనేది మన జీవితంలో నిత్యం మనం తెలిసో తెలియకో అప్లై చేస్తూనే ఉంటాం. నిత్యం మన జీవితంలో యోగా అనేది చాలా అవసరం. మనం ఆరోగ్యంగా ఉండాలన్న ఆనందంగా ఉండాలన్న మొట్ట మొదటిగా మనం యోగంలో ఉండాలి.

యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు మన జీవితంలో ఎప్పుడు సమస్థితిలో ఉండాలి. మనకు వచ్చే సమస్యలను చూసే విధానాన్ని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటది. బ్యాలెన్స్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. 

అటువంటి సమస్థితిని యోగం చేయడం ద్వారా పొందగలుగుతాం. పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరంలో పంచప్రాణాలు, పంచ ఉపప్రణాలు, పంచకోషాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు వీటన్నింటితో పాటు అంతఃకరణము అంటే మనసు బుద్ధి అహంకారము ఇవన్నీ కలిపి నేను అవుతాను అటువంటి నన్ను నేను తెలుసుకోవాలి అంటే వీటి అన్నింటి మీద అవగాహన ఉండగలగాల.

విద్యార్థికి జ్ఞాపకశక్తి అవసరం. గృహిణికి సహన శక్తి అవసరం. గృహస్తుకు నిగ్రహ శక్తి అవసరం. ఇంకా మనం ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఇక్కడ ఎలా నడుచుకోవాలి అనే విచక్షణా తెలిసి ఉండాలి.

ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే క్రమంలో మనం ఎన్నింటినో తెజించాల్సి ఉంటాది. అందులో భాగంగా మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటది. మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి.

కష్టం వచ్చినప్పుడు ఓర్పు నిగ్రహశక్తి ఉండాలి. అప్పుడే అసాధ్యులు సుసాధ్యాలు అవుతాయి. అటువంటి ఓర్పు నిగ్రహ శక్తి సహనం అన్నీ కావాలి. అందుకే మనము ప్రతినిత్యం యోగ సాధన చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా అటువంటి స్థితిలో ఉంటాం. ఇంకా చెప్పాలంటే తమోగుణాన్ని ఛేదించి రజోగుణాన్ని కరిగించి సత్వగుణాన్ని దాటుకొని పరబ్రహ్మ స్థితిని చేరుకోవడమే యోగం.

ఒక పని చేయాలనుకున్నప్పుడు సత్వగుణంతో ఆలోచించి రజోగుణంతో పనిచేసి ఫలితాన్ని తామసగుణంతో ఆస్వాదించాలి అదే యోగం. జీవితంలో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో చేయాలనుకుంటూ ఉంటాం. కానీ సమయం రావాలి అనుకుంటూ ఉంటాం.

మనకు తెలియని విషయం ఏమిటంటే మనం ఏం చేసినా చేయకపోయినా సమయము అనేది వెళ్తూనే ఉంటది. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకు గాను మొట్ట మొదటి స్టెప్ గా యోగా చేయడం ప్రారంభిస్తే మిగతా వన్నీ అవే అంది పుచ్చుకోగలుగుతాం. నేను చేయాల్సిన ప్రయత్నం చేశాను.  ఇక నుంచి యోగ సాధనలో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మీదే.

– అంజనాదేవి, యోగ టీచర్

సెల్ : 9908149365

Leave A Reply

Your email address will not be published.

Breaking