Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్

0 2

కేసీఆర్ కు కరీంనగర్ సెంటిమెంట్

– 12న బీఆర్ఎస్ బహిరంగ సభ
– లోక్ సభ ఎన్నికల శంఖారావం
– భారీ జన సమీకరణకు సన్నాహాలు.

(ఈదుల్ల మల్లయ్య)

సెంటిమెంట్.. పొలిటికల్ లో ఇదో పెద్ద రోగం.. ఎన్నికలలో పోటీ చేసే వారు అందరూ గెలువలని సెంటిమెంట్ ను నమ్ముకునే వారే ఎక్కువ. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెంటిమెంట్. అయినా.. ఎన్నికల్లో గెలువాలని అందరూ భగవంతుణ్ణి కోరుతారు. కానీ.. గెలుపు ఒక్కరిదే అని తెలిసినా వాళ్లు దేవుడిపై భారం వేసి ఎన్నికల బరిలో దిగుతారు. నిబంధనలకు భిన్నంగా గెలుపు కోసం అన్నీ ప్రయత్నాలు చేస్తారు.

కేసీఆర్ సెంటిమెంట్..
ఇగో.. కేసీఆర్ కు కూడా సెంటిమెంట్ ఎక్కువే.. అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గం నుంచి నామినేషన్ వేసే ముందు దుబ్బాక్ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ ప్రభుత్వం మాదే రావాలని కేసీఆర్ ప్రత్యేకంగా యాగాలు చేసారు. అయినా.. కామారెడ్డిలో ఓడి పోయారు. గజ్వేల్ లో ఎమ్మెల్యేగా గెలిసారు. మెజార్టీ ఎమ్మెల్యే సీట్లలో గెలిసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

నిరాశలో కేసీఆర్..
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో నిరాశకు గురైన కేసీఆర్ ఇంకా కోలుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు కాగానే ప్రమాదవశాత్తు నేలపై పడి తుంటి విరిగింది. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్నారు. కానీ.. నిరాశ, నిసృహలో ఉన్న క్యాడర్ కు భరోసా ఇచ్చే వారు లేకుండా పోయారు. నల్గొండ జిల్లా బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పొలిటికల్ దాడి చేశారు. మేడిగడ్డకు వెళ్లి కాంగ్రెసోళ్లు ఏమి పీకుతారని తన స్థాయిని మరిచి మాట్లాడారు. ఆ తరువాత తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

12న కేసీఆర్ సెంటిమెంట్ సభ
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమీ తరువాత నిరాశకు గురైన క్యాడర్ లో జోష్ పెంచడానికి కరీంనగర్ లో ఈ నెల 12న బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకెళ్లుతుంది. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరించడానికి లక్ష మందితో సభను సక్సెస్ చేయాలని పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కరీంనగర్ మైలురాయి..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం.. బీఆర్ఎస్ రెండు మార్లు అధికారంలోకి రావడానికి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ గా నిలుస్తోంది. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ ఆమరణదీక్ష చేయడం ఉద్యమంలో కీలక ఘట్టం. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో కరీంనగర్ లో జరిగే బహిరంగ సభతో తాము ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తామనే ధీమాలో గులాభీ శ్రేణులు ఉన్నాయి. ఇంతకు కేసీఆర్ సెంటిమెంట్ లోక్ సభ ఎన్నికలలో ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

Breaking