Take a fresh look at your lifestyle.

టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిది చేతకాని తనమే..!

0 48

టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిది చేతకాని తనమే..!

దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద అబద్దాల ప్రచారం.

:  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

హైదరాబాద్, మార్చి 19 : మద్యం కేసు డైవర్ట్ చేయడానికే మహిళా బిల్లు పోరాటం బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. మద్యం వ్యాపారం చేసింది ఎవరు..? డబ్బులు తీసుకుంది ఎవరు..? అని ప్రశ్నించారు. “అత్యధికమైన మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీలో ఉన్నారు.

అన్ని కీలక పదవుల్లో మహిళలకు బీజేపీ స్థానం కల్పించింది. ఎయిర్ ఫోర్స్ లో వార్ విభాగానికి మహిళను ఇంచార్జ్ గా నియమించారు. ఏ దేశంలో ఇలా నియమించలేదు. మహిళలంటే ఏమిటో బీజేపీకి తెలుసు ” అన్నారు కిషన్ రెడ్డి. “ట్రిపుల్ తలాక్ మేం రద్దు చేస్తే.. కేసీఆర్ వ్యతిరేకించారు. ఆయన మిత్రుడు బాధపడతారని.. ట్రిపుల్ తలాక్ ను కేసీఆర్ వ్యతిరేకించారు. ఐదేళ్లు మహిళా మంత్రులను పెట్టలేదు. 33 శాతం రిజర్వేషన్ ముందు మీరు పెట్టండి. మొదట ఫామ్ హౌస్, ప్రగతి భవన్ ముందు ధర్నా చేయండి” అని విమర్శించారు కిషన్ రెడ్డి.

ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుంటే…కేసీఆర్.. మాత్రం వారి కుటుంబం వైపు చూస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు “తెలంగాణ ప్రజలే కల్వకుంట్ల కుటుంబాన్ని లొంగదీసుకుంటారు తప్పు లేకుండా ఈడీ ఎవరినీ ప్రశ్నించదు. మద్యం వ్యాపారం చేసింది మీరు.. డబ్బులు తీసుకుంది మీరు. కొంపలు ములుగుతున్నట్టు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ వచ్చారు. మహిళలను ఇంటికి వచ్చే విచారించాలనే చట్టం ఉందని నాకు తెలియదు. దానిపై సుప్రీం కోర్టులో తేల్చుకోవాలి” అని అన్నారు కిషన్ రెడ్డి. “లిక్కర్ కేసు ఎక్కడ మొదలైంది.. కేసు మొదట ఎక్కడ రిజస్టర్ అయ్యింది. అప్పట్లో మద్యం రేట్లు పెరిగాయని వార్తలు రాశారు. ఆ సమయంలో సీబీఐకి ఫిర్యాదు చేశారు. అప్పుడు కల్వకుంట్ల కుటుంబం ఉందని తెలియదు.

ఆ రోజు వచ్చిన ఫిర్యాదులతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. తీగ లాగితే డొంక కదిలినట్టు .. ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చారు. కల్వకుంట్ల కుటుంబం మద్యం వ్యాపారం చేస్తున్నట్టు మాకు తెలియదు. మద్యం వ్యాపారం మేం చేయమన్నామా..? లేక తెలంగాణ సమాజం చేయమందా..? మీకు సంబంధం లేకపోతే ఎందుకు వేధిస్తారు..? అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనితో మోడీకి, కేంద్రానికి, బీజేపీకి ఏ రకమైన సంబంధం లేదు.. ఎవరినీ టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు” అని అన్నారు కిషన్ రెడ్డి. ఎవరు తప్పుచేసినా వదలకూడదనే లక్ష్యం బీజేపీదన్నారు కిషన్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking