Take a fresh look at your lifestyle.

ఆరునెలల్లో కోరుట్లలోని చక్కెర పరిశ్రమను తెరుస్తాం

0 400

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో

కోరుట్లలోని చక్కెర పరిశ్రమను తెరుస్తాం:

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

జగిత్యాల్, మార్చి 11 : “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో కోరుట్ల ప్రాంతంలోని చక్కెర పరిశ్రమను తెరుస్తాం” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటిచ్చారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 25వ రోజు కోరుట్ల నియోజకవర్గం పరిధిలోని ఐలాపూర్ గ్రామం నుంచి కోరుట్ల వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా? కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. వారికి ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆరెస్ చేసిందేం లేదు

బీఆరెస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారు? 2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆరెస్ కు మద్దతు తెలిపింది. కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా? ఆనాడు టీఆరెస్ నుంచి నిన్ను సస్పెండ్ చేసింది నిజం కాదా? తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయినదాంట్లో కేసీఆర్ వాటా ఎంత? 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారు. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నడు మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రు? మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు…విద్యాసాగర్ రావు ఒక లెక్కనా? ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారు.

ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరు? మాట తప్పక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండి. 2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ. 5లక్షలు సాయం అందిస్తుంది. రైతులు బ్యాంకు లకు రుణాలు చెల్లించకండి.. కాంగ్రెస్ వస్తుంది.. రూ. 2లక్షల రుణమాఫీ చేస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పేదవారికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking