Take a fresh look at your lifestyle.

దేశంలో అత్యుత్తమ సంస్థగా ఐఐటీ మద్రాస్

0 13

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అత్యుత్తమ సంస్థగా ఐఐటీ మద్రాస్

న్యూఢిల్లీ జూన్ 7;: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది. వరుసగా ఐదోసారి మొదటిసారి స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ప్రైమ్ వర్క్ 2023 ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకింగ్‌లు ప్రకటించింది. బోధన, నేర్చుకోవడం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన శిక్షణ, గ్రాడ్యుయేషన్ ఔట్ కమ్, ఔట్ ట్రేట్.. అందరికీ భాగస్వామ్యం ధృక్పదం వంటి ప్రామాణికాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ర్యాంకులను విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్‌కు మొదటి ర్యాంక్ లభించగా, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు రెండో ర్యాంక్ దక్కింది. మూడో స్థానంలో ఐఐటీ ఢిల్లీ, నాల్గో స్థానంలో ఐఐటీ బాంబే, ఐదో స్థానంలో ఐఐటీ కాన్పూర్ నిలిచాయి. ఢిల్లీ ఎయిమ్స్‌కు ఆరో ర్యాంక్, ఐఐటీ కరగ్‌పూర్‌కు 7వ ర్యాంక్, ఐఐటీ రూర్ సిటీకి 8వ ర్యాంక్, ఐఐటీ గువాహటికి 9వ ర్యాంక్, జేఎన్యూకి 10వ ర్యాంక్ వచ్చింది. టాప్ 10 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు చోటు దక్కించుకోలేకపోయాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking