Take a fresh look at your lifestyle.

బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు భారీ స్పందన

0 273

బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు భారీ స్పందన

హైదరాబాద్, మార్చి 25 : హైదరాబాద్ నగరం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహిస్తున్న మా నౌకరీలు మాగ్గావాలి  ” నిరుద్యోగ మహాధర్నా”సక్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత, విద్యార్థులు హాజరయ్యారు, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఈటెల రాజేంధర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ మూడు తరాల ఉద్యమం చేసిందని పేర్కొన్నారు. 1952 – ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం. 1969 – 369 విద్యార్ధుల బలిదానం.  2001- మలిదశ ఉద్యమం.  విద్యార్థుల బలిదానం, ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిందన్నారు ఆయన.

1,91,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని తెలంగాణ తొలి అసెంబ్లీలో నేనే ప్రకటించాను. ఇవి కాక ప్రైవేట్ ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు, సింగరేణిలో లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాము. కానీ ఎన్ని ఉద్యోగాల విషయంలో కెసిఆర్ మోసం చేశారన్నారు ఈటెల రాజేంధర్.

GHMC లో 1700 మందినీ ఒక కలం పోటుతో తీసివేస్తే నేనే అడ్డుకున్నా. కెసిఆర్ వల్ల ఆర్టీసీ లో 39 మందిని బలి తీసుకున్న విషయం మర్చిపోవద్దు. కెసిఆర్ పాలనలో బాగుపడలేదు, బ్రతికి చెడ్డాము.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం తీసివేస్త అని చెప్పిన కెసిఆర్ ఇంకా కొనసాగిస్తున్నారు. చివరికి TSPSC నీ కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టారు అంటే సిగ్గుమాలిన, దుర్మార్గ విధానం లేదు.
కెసిఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అన్నారు ఆయన.

నిరుద్యోగులు బిజీ గా ఉంచాలనే నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తున్నారు.  TSPSC లో 6 పరీక్షలు లీక్ అయ్యాయి. 30 లక్షల మంది నిరుద్యోగుల్లో బాధ గుండెల్లో నిండిపోయింది.  ఆందోళన చేస్తే ఉస్మానియా విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. కెసిఆర్ పోలీసులతో రాజ్యం నడపలేరు. తెలంగాణ సమాజం నీ మెడలు వంచి భరతం పడుతుందన్నారు ఆయన.

నయీం సిట్, ఎమ్మెల్యేల సిట్, డ్రగ్స్ కేసు.. ఈ కేసులన్నీ ఏమయ్యాయో ప్రజలందరికీ తెలుసు.
నీ చెప్పు చేతుల్లో ఉండే సిట్ ల మీద విశ్వాసం లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఆయన. TSPSC పేపర్ లేకేజీకి సంపూర్ణ భాధ్యత కెసిఆర్ ఆయన ప్రభుత్వం వహించాలన్నారు ఆయన. Tspsc పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయలు ఇవ్వాలని డిామాండ్ చేశారు. కెసిఆర్ లిక్కర్ స్కాంలో కూతురుని కాపాడుకొనే పనిలో ఉన్నారు తప్ప నిరుద్యోగుల ఆర్తనాదాలు పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగుల్లారా ఆత్యహత్యలు చేసుకోవద్దు.
మేము అండగా ఉంటాము అని ఇందిరా పార్క్ వేదికనుండి ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking