Take a fresh look at your lifestyle.

పోలీసు దొంగలు ఎందరో..

పోలీసు శాఖలో అక్రమ సంపాదనలో పోటీ.. పది శాతమే నిజాయితీ పరులు..

0 2,905

దొరుకని పోలీసు దొంగలు ఎందరో…
– అక్రమ సంపాదనలో పోటీ..
– రియల్ దందాలో కోట్ల సంపాదన..
– నిజాయితీగా విధులు నిర్వహించేది పది శాతమే..

పోలీస్… నీతికి, నిజాయితీకి మారు పేరు.. ఇది సినిమాలో డైలాగ్.. కానీ.. అవినీతి, అక్రమ సంపాదనకు మారు పేరు నేటి పోలీసు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అవినీతి నిరోదక శాఖ బాస్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకారించిన తరువాత అవినీతి పోలీసు అధికారుల బండారం బయట పడుతుంది. వాళ్లు సంపాదిస్తున్న అక్రమ సంపాదన చూసి ఆశ్చర్య పోతున్నారు జనం.

ఖాకీ డ్రెస్ వేసుకోగానే తమకు అడ్డు లేదన్నట్లుగా నెల నెల మాముళ్లు తీసుకోవడం తమ విధులలో భాగమని వారు భావిస్తున్నారు. సో.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేసిన పోలీసు అధికారులు కోట్లు సంపాదించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా రహస్య సమాచారం సేకరించి అక్రమంగా డబ్బులు సంపాదించిన పోలీసు అధికారులు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తున్నారు.

తాజాగా సీసీఎస్ లో ఏసీపీగా పని చేస్తున్న ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయగా కోట్ల రూపాయలు ఆస్తులు బయట పడ్డాయి. ఇప్పటికే 40 లక్షల రూపాయల నగదు, బంగారు అభరణలు స్వాధీనం చేసుకున్నారు. ట్వీస్ట్ ఏమిటంటే ఎస్ పి గోనే సందీప్ కు చెందిన విలువైన డాక్యుమెంట్లు ఏసీబీ అధికారుల సోదాలలో దిరికాయి.

దొరికినోడే దొంగ..

పోలీసు శాఖలో దొరికినోడే దొంగ.. అవినీతికి పాల్పడకుండా ఆ శాఖలో పని చేసే వారు పది శాతం కూడా ఉండరు. అక్రమ సంపాదనలో పోటీ పడే పోలీసు అధికారుల పాపం పండితే అప్పుడప్పుడు ఏసీపీ ఉమామహేశ్వర్ రావులా ఏసీబీ అధికారుల వలకు చిక్కుకుంటున్నారు. అయితే.. ఏసీబీ అధికారుల విచారణలో ఉమామహేశ్వర్ రావు సహకారించడం లేదని అధికారులు చెబుతున్నారు.

ఏసీపీ ఉమామహేశ్వర్ రావుపై…

ఖాకీ డ్రెస్ వేసుకున్న ఏసీపీ ఉమామహేశ్వర్ రావుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే న్యాయాన్ని అన్యాయంగా.. అన్యాయాన్ని న్యాయంగా మార్చడంలో అతనికి అతనే దిట్టా అని పోలీసు శాఖలో టాక్. తాజాగా ఓ చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి సెటిల్మెంట్స్ చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. ఇబ్రహింపట్నంలో రియల్ ఎస్టేట్ దందా చేస్తూ కూడా మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking