Take a fresh look at your lifestyle.

తెలంగాణలో హర్యాన మద్యం పట్టివేత

0 16

తెలంగాణలో హర్యాన మద్యం పట్టివేత

రంగారెడ్డి, మే 20 : హర్యానా రాష్ట్రం నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారైనట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అరుణకుమార్‌ తెలిపారు. ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కాప్రా సమీపంలో ఘట్‌కేసర్‌ ఎక్సైజ్‌ సీఐ మల్లయ్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మారుతి ఆల్టో కారును ఆపి తనిఖీచేశారు. అందులో 45 జానీవాకర్‌ రెడ్‌లేబుల్‌ ఫుల్‌బాటిళ్లను గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా నగరంలోని మారుతినగర్‌, లోతుకుంటకు చెందిన జంగా లక్ష్మారెడ్డిగా గుర్తించారు.

కారులో 45బాటిళ్లను స్వాధీనం చేసుకోని ఇంట్లో సోదాలు చేయగా 85జానివాకర్‌ రెడ్‌లెబుల్‌ పుల్‌బాటిళ్లు లభించాయి. జంగారెడ్డి తన స్నేమితులైన తాటి శ్రీకాంత్‌, నాగరాజులతో కలిసి హర్యానా నుంచి తక్కువధరకు కొనుగోలు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు మద్యాన్ని విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

పట్టుబడిన 130 మద్యం బాటిళ్ల విలువ రూ.3లక్షల 50 వేలు ఉంటుందని తెలిపారు. మద్యం బాటిళ్ళతో పాటు అల్టోకారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని జంగారెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న తాటి శ్రీకాంత్‌, నాగరాజులను త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్‌ జిల్లా సూపరింటెండెట్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ముకుందరెడ్డి, ఎక్సైజ్‌ సీఐ మల్లయ్య, ఎస్‌ఐలు పురుషోత్తంరెడ్డి, శ్రావణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking