Take a fresh look at your lifestyle.

CAS కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

0 82

కేరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ (CAS)కు

దరఖాస్తు చేసుకునేందుకు అధ్యాపకులకుఅవకాశం ఇవ్వండి.

ఓయూ ఉపకులపతిని కలిసిన ప్రఫెసర్లు

ఉస్మానియా విశ్వవిద్యాలయం: పదోన్నతుల్లో భాగంగా కేరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్.. CAS కు దరఖాస్తు చేసుకునేందుకు అధ్యాపకులకు తిగిన వెసులు బాట్లు ఇవ్వాలని ఉస్మానియా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్.. ఔటా విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్ సరస్వతమ్మ నేతృత్వంలోని ఔటా కార్యవర్గం ఉపకులపతి ప్రొఫెసర్ దెండెబోయిన రవిందర్ యాదవ్ ను కలిసి పలు అంశాలతో కూడిన విజ్ఞాపన పత్రం అందచేసింది. మౌఖిక పరీక్ష కు సంబంధించిన కాల్ లెటర్ ఇచ్చే వారం ముందే అర్హుల జాబితాను ప్రదర్శించాలని కోరింది.

C-BOS ‘పరిశీలన కోసం సాధారణ సూచనలు’కి సంబంధించి ‘బ్రీఫింగ్ సెషన్’ను ఏర్పాటు చేయాలని OUTA పేర్కొంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking