Take a fresh look at your lifestyle.

ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

0 12

ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిశ్రమలోకి వెళ్లేందుకు కార్మికులు ఉదయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు పోలీసులు భారీగా చేరుకొని కార్మికులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. పరిశ్రమ వద్ద జరుగుతున్న గొడవ విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అక్కడకు వెళ్లారు. ఆయన వద్దకు కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు.

పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన పోలీసులు హరీష్‌ను అక్కడి నుంచిపంపేశారు. కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని హరీష్ ఖండించారు. ” కార్మికుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దుఃఖంలో ఉన్నావారికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా వేధించడం సరికాదు. తెలంగాణకు చెందిన బాధితులకు బీఆర్ఎస్ తరఫున మేం సాయం అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా, రియాక్టర్లు పేలకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి.” అని అన్నారు. అంతకు ముందు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులను ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాధితులకు భరోసా ఇచ్చారు.

మరొకరి మృత దేహం గుర్తింపు

ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందినట్టు తేలింది. హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేష్ మృతదేహం ఈ ఉదయం లభించింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే పరిశ్రమ డైరెక్టర్ సహా నలుగురు మృతదేహాలు లభించాయి.. బుధవారం ఆయిల్ బాయిలర్‌లో మంటలు చెలరేగి పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో పరిశ్రమ డైరెక్టర్‌ రవిశర్మ, దయానంద్‌, సుబ్రహ్మణ్యం, సురేష్‌ పాల్‌, చాకలి విష్ణు, రమేష్‌ చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking