Take a fresh look at your lifestyle.

డబ్ల్యూటీఐటీసీ స‌ల‌హాదారుగా మ‌లేసియా ఎంపీ

0 12

డబ్ల్యూటీఐటీసీ స‌ల‌హాదారుగా

మ‌లేసియా ఎంపీ గణ‌బతిరావ్ వీర‌మ‌న్

హైద‌రాబాద్‌, మే 7 : మ‌లేసియాలోని క్లాంగ్ పార్ల‌మెంట్ స‌భ్యుడు గణ‌బతిరావ్ వీర‌మ‌న్ ను త‌మ స‌ల‌హాదారుగా నియ‌మిస్తూ ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ప్ర‌క‌ట‌న వెలువరించింది. సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో ఉన్న గ‌ణ‌బ‌తిరావ్ ప‌క‌ట‌న్ ర‌క్య‌త్ లోని సెలంగ‌ర్ మ‌రియు హ‌ర‌ప‌న్ స్టేట్ అడ్మినిస్ట్రేష‌న్‌ల‌లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌గా సేవ‌లు అందించారు. కోటా అలం షా మ‌రియు కోట కెమ్యూనింగ్ నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. 2022 నుంచి క్లాంగ్ నుంచి ఎంపీగా గ‌ణ‌బ‌తిరావ్‌ ప్ర‌జాసేవలో ఉన్నారు.

ఒమ‌న్ రాజ‌కుటుంబీకుడు ఫిరాజ్ బిన్ ఫ‌తిక్ ను డబ్ల్యూటీఐటీసీ ప్యాట్ర‌న్ మెంబ‌ర్‌గా నియ‌మించిన అనంత‌రం మ‌రో ముఖ్య నియ‌మాకంగా శ్రీ వీర‌మ‌న్‌ గారిని నియ‌మించింది. ఈ నూత‌న ఎంపిక ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ తెలుగువారి కోసం వివిధ దేశాల్లోని ప్ర‌ముఖుల‌ను డబ్ల్యూటీఐటీసీ ఎంపిక చేస్తున్న విధానం స్ప‌ష్ట‌మైంది.

ఈ నియామ‌కం ప‌ట్ల డబ్ల్యూటీఐటీసీ చైర్మ‌న్ సందీప్ కుమార్ మ‌ఖ్త‌ల స్పందిస్తూ, స‌ల‌హాదారుగా శ్రీ గ‌ణ‌ప‌తిరావ్ వీర‌మ‌న్‌ గారి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ మాకెంతో ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. ఈ నియామకాల నేప‌థ్యంలో డబ్ల్యూటీఐటీసీ సంస్థ యొక్క ఉద్దేశాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌డం మ‌రియు మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేయ‌నున్నారు` అని వెల్ల‌డించారు.

డబ్ల్యూటీఐటీసీని మ‌రింత‌గా విస్త‌రించ‌డం మ‌రియు ప్ర‌భావ‌వంతంగా చేయ‌డం కోసం గ‌ణ‌బ‌తిరావ్ వీర‌మ‌న్‌ గారి నియామ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. డబ్ల్యూటీఐటీసీ సేవ‌ల‌ను న‌లుదిశ‌లాగా విస్త‌రించ‌డంతోపాటుగా ప్ర‌ముఖుల‌ను సైతం భాగ‌స్వామ్యుల‌ను చేయ‌డ‌మనే ప్ర‌క్రియ‌కు ఈ నిర్ణ‌యం మ‌రింత దోహ‌ద‌ప‌డ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking