Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాష్ట్రంలో తాసిల్దార్ పై కేసు నమోదు

0 294

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి

తాసిల్దార్ పై కేసు నమోదు

హైదరాబాద్. మార్చి 15 : వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ కు  విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్ పి. జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, , ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వేనెంబర్ 181లో 42 ఎకరాల ప్రభుత్వ భూమిని మహేశ్వరం మాజీ తాసిల్దార్ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ , ఈఐపిల్ కన్ స్ట్రక్షన్  యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డికి అప్పనంగా అందజేశారు.

ఈ విషయమై దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా XVII అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం సిఐ మధుసూదన్ సెక్షన్ 420, 166 కింద తాసిల్దార్ జ్యోతి సబ్ రిజిస్టర్ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.

ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు తో పాటు తెలంగాణ హైకోర్టు WP37146/2022 ద్వారా విచారణ కూడా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉండగా భూముల విషయమై సాక్షాత్తు తాసిల్దార్ పై కేసు నమోదు కావడం తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి కావడం విశేషం. మహేశ్వరం పోలీసులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.

Leave A Reply

Your email address will not be published.

Breaking