Take a fresh look at your lifestyle.

అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులు సహా ఐదుగురి మృతి

0 75

అగ్ని ప్రమాదం.. హైదరాబాద్ నుంచి దేశ వ్యాప్తంగా ఆ అగ్ని ప్రమాదాలు పెరిగి పోతున్నాయి. ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం..  వైద్య దంపతులు సహా ఐదుగురి మృతి

ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగింది. ఓ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో వైద్య దంపతులతో పాటు ఐదుగురు మరణించారు. సమాచారం అందకున్న పోలీసులు, ఎనిమిది అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. బ్యాంక్​మోర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

వికాస్ హజారా, ప్రేమ హజారా అనే దంపతులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. వీరు సొంతంగా ఆస్పత్రిని నిర్మించుకున్నారు. వీరి ఇల్లు కూడా ఆస్పత్రిలోనే ఉంది. వీరి ఇంటికి, ఆస్పత్రికి ఓ కారిడార్ ఉంది. ఈ కారిడార్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడింది. ఈ పొగ వల్ల ఊపిరాడక వైద్య దంపతులు సహా వీరి పనిమనిషి, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రోగులెవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు. అలాగే మంటలు ఆస్పత్రి రెండో అంతస్తుకు వ్యాపించాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking