Take a fresh look at your lifestyle.

రైతు హంతకుడు కేసీఆర్ : రేవంత్ రెడ్డి

0 16

రైతు హంతకుడు కేసీఆర్

: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తొమ్మిదేళ్లలో రైతులు ఏ ఒక్క రోజు కూడా సంతోషంగా లేరు. తెలంగాణ మోడల్ అంటే రైతుల ఆత్మహత్యలా అని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బాధ్యతాయితంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై నెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కొంటేనే కొంటామని అంటే.. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? రైతులు ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కి.. రైతుల గుండెలపై తన్నే ప్రయత్నం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ సంవత్సరం 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక 2లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు కారణం సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ రైతు హంతకుడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వడగళ్ల వానతో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఈ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు 20వేలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.

మామిడి తోటలకు ఎకరాకు 50వేలు నష్టపరిహారం అందించాలి. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలి. రైతుకు కావాల్సింది రైతు బీమాకాదు.. పంట బీమా. పంట నష్టం పరిశీలించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ లు చేసుకుంటున్నారు. శాసనసభ్యులను క్షేత్ర స్థాయిలో అపర్యటనకు పంపాలి. ఐయేఎస్ అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేయించాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడతామని అన్నారు. ఈరోజు నుంచి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టం పై నివేదికలు ఇస్తాం. రైతులకు మనో ధైర్యం కల్పిస్తాం. దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆరునెలల్లో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేస్తామని అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking