Take a fresh look at your lifestyle.

టీఎస్ పీఎస్సీ కాన్ఫిడేన్సియల్  ఉద్యోగులపై చర్యలేవి..?

0 17

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 

కాన్ఫిడేన్సియల్  ఉద్యోగులపై చర్యలేవి..?

 టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు – 01

  టీఎస్ పీఎస్సీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ లాంటిదే.. పేపర్ లీకేజీ కేసులో అసలైన నిందితులను  శిక్షించలేదనే ఆరోపణలున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం టీఎస్ పీఎస్సీని ప్రక్షాళనం చేసింది. టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డితో పాటు మెంబర్ లను నియమించింది.

 కేసీఆర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహరాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సవాల్ తీసుకుంది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన అసలైన టీఎస్ పీఎస్సీ ఉద్యోగులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేరనే ఆరోపణలున్నాయి.

 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాన్ని టీఎస్ పీఎస్సీ చేపడుతుంది. నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహించి ప్రతిభ వంతులకు సర్కార్ కొలువు ఇచ్చే బాధ్యత ఆ సంస్థదే. అయితే.. ప్రభుత్వం జాబ్ ల కోసం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత అభ్యర్థులకు ఇచ్చే పరీక్ష పేపర్ లను జాగ్రత్తగా చూడటానికి కాన్ఫిడెన్సియల్ సెక్షన్ ప్రత్యేకంగా ఉంటుంది. టీఎస్సీపీఎస్సీ చైర్మన్ ఆధ్వర్యంలో కాన్ఫిడెన్సియల్ విభాగం పని చేస్తోంది.

 కేసీఆర్ ప్రభుత్వంలో వరుసగా పేపర్ లీకేజీల వ్యవహారాలు బహిర్గతం కావడం వల్ల అసెంబ్లీ ఎన్నికలలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారు. ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాయి. 

 కాన్ఫిడేన్సియల్ ఉద్యోగులను రక్షించిన కేసీఆర్ ప్రభుత్వం

  ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికెషన్ లు అన్నీ కాన్పిడేన్సియల్ సెక్షన్ ఉద్యోగులు చూసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ లో అప్ లోడ్ చేసిన పరీక్షలకు సంబంధించిన పాస్ వర్డ్ కాన్పిడేన్సియల్ ఆఫీసర్ శంకరలక్ష్మీ, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలు చూస్తుంటారు. వీరిద్దరి ఆధీనంలోని  పాస్ వర్డ్ ను నిందితులు సేకరించారు. అందుకు బాధ్యులుగా చేసి ఆ ఇద్దరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

 తప్పు చేసినోళ్లను శిక్షించాల్సిందే.

కానీ.. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న  కాన్ఫిడేన్సియల్ ఉద్యోగులను ఈ పేపర్ లీకేజీ కేసులో నుంచి తప్పించారు. పాస్ వర్డ్ లీక్ కావడానికి  కాన్ఫిడేన్సియల్ ఆఫీసర్ శంకరలక్ష్మీ, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణల నిర్లక్ష్యం కారణం. అయినా.. వీరిలో సత్య నారాయణను ఫిర్యాదు దారుడిగా.. శంకరలక్ష్మీని సాక్షిగా మాత్రమే తీసుకున్నారు.

 పేపర్ లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్సియల్ ఆఫీసర్ శంకర లక్ష్మీని సిట్ అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. తాను  డైరీలో రాసిన పాస్ వర్డ్ ఎవరో దొంగిలించారని వాంగ్మూలం ఇచ్చారు. అయితే.. డైరీలో శంకరలక్ష్మీ ఎలాంటి వివరాలు రాయలేదని విచారణలో తేలినట్లు తెలిసింది.

 కొత్త బాస్ కు సవాల్..

 టీఎస్సీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి పేపర్ లీకేజీ కేసు సవాల్ మారింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తే కాన్ఫిడేన్సియల్ ఆఫీసర్ శంకరలక్ష్మీ, అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు పేపర్ లీకేజీతో ఉన్న సంబంధం బహిర్గతం అవుతుందంటున్నారు నిరుద్యోగులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking