Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీల కోసం ఆశావహుల ప్రయత్నాలు

0 263

ఎమ్మెల్సీల కోసం కసరత్తు
ఆశావహుల ప్రయత్నాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 16, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, మరో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. కానీ త్వరలో ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో మరో ఐదుఎ మ్మెల్సీ పదవులు ఖాళీ కనున్నాయి. వీటికోసం పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు.

వచ్చేది ఎన్నికల కాలం కావడంతో టిక్కెట్ ఇవ్వలేని. పార్టీ వదులుకోలేని నేతలకు చాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తమకు అవకాశం కల్పించాలంటూ..  కేసీఆర్ పై ఒత్తిడి  పెంచుతున్న సీనియర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వి. గంగాధర్‌గౌడ్‌, ఎలిమినేటి కృష్ణారెడ్డి, నవీన్‌కుమార్‌  ల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియామకమై డి. రాజేశ్వర్‌రావు, ఫరూక్‌ హుస్సేన్‌ పదవీ కాలం మే నెల 27న ముగుస్తోంది. అయితే ఈ ఐదింటికి ఎన్నికల కమిషన్‌ ఇంకా షెడ్యూల్‌ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు నేరుగా రాజకీయ నియామకాలు కావడంతో ఎన్నికల ఏడాదిలో ఈ పదవులను ఆశిస్తున్న పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌ పెద్దల దగ్గర ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మెజారిటీ టికెట్లని అధినేత కేసీఆర్‌ ఇప్పటికే సంకేతాలివ్వడంతో ఈసారి టికెట్‌ ఆశిస్తున్న ఇతర నేతలు ముందుగా ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకుని తర్వాత టికెట్‌ల కోసం ప్రయత్నించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాల్లో ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నవారిలో కొందరికి   పదవి దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుండడంతో పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగు తోంది.

ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గతంలో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా ఎంఐఎంకు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సీటు విషయంపై అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ను కలిసిచర్చించారు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో దాదాపు సమానంగా కార్పొరేటర్‌ సీట్లు గెలిచినప్పటికీ మేయర్‌ పదవికి మజ్లిస్ పోటీ పడలేదు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 127 ఓట్లుండగా సింహభాగం ఓట్లు బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు చెందినవే. అసెంబ్లీలో కేటీఆర్, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో తాము యాభై స్థానాల్లో పోటీ చేస్తామని సవాల్ చేశారు. అయితే అది వాగ్వాదం మాత్రమేనని రాజకీయంగా రెండు పార్టీల మధ్య కోపరేషన్ ఉంటుందని.., ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  నిరూపించాలని ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు అనుకుంటున్నారు.

ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి పదవిని ఆచితూచి అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పదవుల పందేరం బీఆర్‌ఎస్‌లో రసవత్తరంగా మారింది.

కేసీఆర్ ఈ ఐదు ఎమ్మెల్సీ సీట్లతో వీలైనంత వరకూ సీనియర్ నేతల అసమ్మతిని తగ్గించేందుకు ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఖమ్మం లాంటి చోట్ల కొంత మందికి సీట్లను సర్దుబాటు చేయడం కష్టంగా ఉంది. అలాంటి చోట.. ఎవరో ఒకర్ని ఒప్పించి.. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కాలపరిమితి మార్చినెలాఖరుకే ముగియనుండటంతో.. వచ్చే నెల ప్రారంభంలోనే షెడ్యూల్ రావొచ్చని అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking