Take a fresh look at your lifestyle.

పఠాన్ చెరువులో వ్యర్థాల ప్రాజెక్ట్

0 12

పఠాన్ చెరువులో వ్యర్థాల ప్రాజెక్ట్

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడ లో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ప్రారంభించారు. పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 104.24 కోట్ల రూపాయలతో వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించారు. స్పీకర్ తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ కలిసి ఈ శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, TSIIC ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాశమైలారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మరియు వివిధ పరిశ్రమల సహకారంతోభాగస్వామ్యంతో నిర్మించారు. రాంకీ ప్రైవేట్ సంస్థ కాలుష్య నియంత్రణ మండలితో ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్మా, కెమికల్ రసాయనాలు తయారు చేసే సుమారు 60 రసాయన పరిశ్రమలకు రక్షణగా ఉంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. పాశ మైలారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన 3 ఫైర్ స్టేషన్ లను ప్రభుత్వ ఆధీనంలో చేసుకొని అదనపు స్టాప్ ను నియమించి, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పారిశ్రామికవేత్తలు చేసిన సూచనల మేరకు ప్రతినెల రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking