ఓ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కథ…
జీవితం చాలా విచిత్రం.. లక్కి లాటరీలా ఎప్పుడన్నా జీవితంలో ఏదైనా మారవచ్చు.. ఇగో.. కర్నూల్ కు చెందిన అభిరాంకు మంచి అవకాశం వచ్చింది. బ్రతుకు తెరువు కోసం తాపీ మేస్త్రీగా పని చేసే అభిరాంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసే భాగ్యం కలిగింది.. కారణం..? అభిరాం రచయిత. అతను అక్షరాలను తుపాకి తూటల్లా పేల్చుతాడు. మహాకవి శ్రీశ్రీ లా కళ్ల ముందు కనిపించే ప్రతి వస్తువు మీద కవిత అల్లుతాడు.. పాట రాస్తాడు.. ఇగో.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో అభిరాం రాసే పాటలు పల్లెలలో.. పట్టణాలలో గోల చేస్తాయి. అభిరాం తన ఫీలింగ్ కు అక్షర రూపం ఇచ్చాడు. అతని హృదయంలో కలిగిన భావన ఇదే..
ఓ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కథ…
ఓరోజు ఏదో పనిచేసుకుంటుంటే
కాల్ మోగింది
ఎవరబ్బా అనుకుంటున్నా…
నేను లక్ష్మీ శ్రీనివాస్ ని
పార్టీపరంగా పాట రాస్తారా…!
ఓ పెద్ద సార్ మీతో మాట్లాడతాడు అన్నారు
సరేనండీ అన్నా ఏదో ఆలోచిస్తూ…!
కలిపిన కాన్ఫరెన్స్ కాల్లో ఎవరు సార్ మీరు అన్నా…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి PA రవికిశోర్ అన్నారు
ఖంగుతిని చెప్పండి సార్ అన్నా…
నీ గురించి చాలా విన్న
బాగా రాస్తావంటా అన్నారు
ఏదో మీ ఆశీస్సులన్నా
నా కథ అడగ్గా
కట్టే కొట్టే తెచ్చేగా చెప్పి రెండు పాటలు రాసినవి చెప్పా…
బాగున్నవి
తాడేపల్లి రమ్మన్నారు
ఆ రోజు సర్లేనని గట్టెక్కా…
అనుకోని పరిస్థితుల్లో
ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు వెళ్ళి నా పాటలు ఇచ్చాను…
నాకు ఇప్పటికి సందేహమే
నేను ఏమిటి
నాకు అపాయింట్మెంట్ రావడం ఏమిటి
చీమలు కూడా దూరని ముఖ్యమంత్రి ఆఫీసుకెళ్ళడమేటి
ఎందరో ఖద్దరు చొక్కాలు కళ్ళ పెద్దవి చేసి నన్ను చూడడం ఏమిటి…
వాళ్ళు లోపలికి రాలేక బయటే ఉండడం ఏమిటి
పోలీసులు నన్ను బాబు నువ్వు వెళ్ళు అనడం ఏమిటి
అక్కడ నాకు అంత ఆత్మీయ ఆదరణ ఏమిటి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి PA సమక్షంలో నా పాటలు ప్రొడ్యూసర్ వినడం ఏమిటి
త్వరలో వీటిలో కొన్ని రికార్డు చేద్దాం అనడం ఏమిటి
నేను సరే అనడం ఏమిటి
మంత్రులు ఎమ్మెల్యేల నిండిన ముఖ్యమంత్రి
కార్యాలయంలో నేను లేడిపిల్లలా తిరుగుడు ఏమిటి
అక్కడి నీట్ అండ్ క్లాస్ పురుషులు
నా మాస్ ముఖం చూసి ఆశ్చర్యపోవడం ఏమిటి…
మ్యానిఫెస్టో మిటింగ్లో ఉన్న ముఖ్యమంత్రిని నేను చూడడం ఏమిటి
రవికిశోర్ గారు మళ్ళా కలుద్దాం అనడం ఏమిటి
నన్ను నేనే నమ్మలేకపోతున్న
ఈ రోజు ఎదురైన అనుభవానికి…
కొన్ని అంతే మరీ…
ఏదైతేనేం ముఖ్యమంత్రి PA రవి కిశోర్ గారు చాలా కృతజ్ఞతలు
మీ చలువతో ఊహించని అనుభూతులు పొందాను ఈ రోజు…
– అభిరామ్ 9704153642