Take a fresh look at your lifestyle.

పెళ్లికి నో చెప్పడానికి ఏదో కారణం కావాలి కదా..

0 104

పాత మంచం ఇచ్చారని పెళ్లికి నో చెప్పిన పెళ్లి కొడుకు

చివర్లో పెళ్లి కూతురు తండ్రి ఇచ్చిన ట్విస్ట్​ అదుర్స్​..!

కులాలు వేరైనా.. మతాలు వేరైనా.. ప్రేమ పెళ్లి.. కట్నం తక్కువ.. ఇగో ఇలా ఏదో కారణంతో పెళ్లి క్యాంసల్ కావడం అరుదుగా వింటుంటాం. కానీ.. ఇగో ఈ పెళ్లి మాత్రం పాత మంచం ఇచ్చారని పెళ్లికి నో చెప్పిన పెళ్లి కొడుకు. అవునండీ.. ఇది నిజం. తనకు పాత మంచం ఇచ్చారని పెళ్లికొడుకు నిఖాకు నిరాకరించిన ఘటన హైదరాబాద్ బండ్లగూడలో జరిగింది.

హైదారబాద్ : హైదరాబాద్​లో ప్రైవేటు స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా పని చేసే మౌలాలికి చెందిన మహమ్మద్‌ జకారియాకు పాతబస్తీ బండ్లగూడకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు వైపుల వారు పెద్దల సమక్షంలో కట్నకానుకలు మాట్లాడుకున్నారు. ఈ నెల 13న వధువు ఇంటి వద్ద ఘనంగా నిశ్చితార్థం కూడా చేశారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక మసీదులో పెళ్లి కావాల్సి ఉంది. వారి సాంప్రదాయం ప్రకారం శనివారం సాయంత్రమే పెట్టుపోతలు..

అవేనండీ మంచం, ఇతర ఫర్నీచర్‌ వరుడి ఇంటికి పంపారు. అయితే మంచం విడి భాగాలు జోడిస్తుండగా అది విరిగిపోయింది. దీంతో పాత మంచానికి రంగులు వేసి తనకు పంపించారని భావించిన పెళ్లికుమారుడు.. నిఖా సమయానికి రాలేదు. దీంతో వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లగా.. ‘పెళ్లికి ముందు మట్లాడుకన్న ప్రకారం కట్నకానుకలు పంపలేదు. పాత మంచం ఎందుకు ఇచ్చావంటూ గొడవపడ్డాడు’. ఇందుకు వరుడి తల్లి కూడా వంతు పాడింది. చివరకు తాను ఈ పెళ్లి చేసుకోనని నిఖా చేసుకోవాల్సినోడు తెగేసి చెప్పాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్సై మాట్లాడగా వరుడు పెళ్లికి అంగీకరించాడు.

అయితే ఇక్కడే వధువు తండ్రి అద్దిరిపోయే ట్విస్ట్​ ఇచ్చాడు.

పెళ్లికి ముందే పెళ్లి కొడుకు ఇన్ని బాధలు పెట్టినోడు తరువాత తన కూతురును ఇంకెన్ని బాధలు పెడుతారో అనుకున్నాడు వధువు తండ్రి. ఈ పెళ్లికి వరుడు ఒప్పుకున్నా.. తాను ఒప్పుకునేదే లే అంటూ మ్యారేజ్​ క్యాన్సిల్​ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Leave A Reply

Your email address will not be published.

Breaking