Take a fresh look at your lifestyle.

ఢీల్లీలో బీసీల ధర్నా సక్సెస్

0 52

బడ్జెటులో కేటాయింపులో నిర్లక్ష్యం

దద్దరిల్లిన జంతర్ మంతర్ పార్లమెంట్ వద్ద  బిసిల భారీ ధర్నా

మద్దతు తెలిపిన పార్లమెంట్ సభ్యులు

న్యూ డిల్లీ ఫిబ్రవరి 8
కేంద్ర బడ్జెటులో బీసీలకు కేవలం 2వేల కోట్లు కేటాయించి అన్యాయం చేశారని నిరసిస్తూ వందలాదిమంది బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. పెద్ద యెత్తున ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కదలి రావడంతో నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ మహా ధర్నాను ఉద్దేశించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య, టిఆర్ఎస్ – పార్లమెంటరీ నాయకులు డా. కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ ప్రసంగించారు.

ఈ మహాధర్నా కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘ కన్వీనర్ లాల్ కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నరేష్ నాయకత్వం వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్ సమన్వయం చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మహా ధర్నాను ఉద్దేశించి ప్రసంగిస్తూ బి.సిలకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ సమర్పించారు.

రాజకీయ రంగంలో బి.సి ల ప్రతినిత్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటివల సేకరించిన గణాంకాల ద్వార తెలిoది. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్సు లో 75 సంవత్సరాల బి.సి ల ప్రాతినిద్యం సర్వే చేసి లేక్కిoచగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. బి.సిలకు విద్యా-ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నవి. కాని రాజకీయ రిజర్వేషన్లు పెట్టలేదు.

అంతేకాదు SC/ST లకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సిలకు పెట్టలేదు. సామాజిక వర్గాలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. బి.సి లకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని గణాంకాలు తెలుపుతునాయి 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక్క బి.సి. పార్లమెంట్ సబ్యులు లేరన్నారు.ఈ మహాధర్నాలో నీలావెంకటేష్, మారేష్, వరప్రసాద్, నాని, పితాని ప్రసాద్, వేముల రామకృష్ణ, రాజకుమార్, భూపేసాగర్, నందగోపాల్, తిరుమలగిరి అశోక్, హనుమయ్య, కృష్ణమాచారి, రెడ్డి మళ్ళ, బెల్లం మాధవి, శరత్, ఆది మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking