Take a fresh look at your lifestyle.

మరో నూతన కేంద్ర పాలిత ప్రాంతంగా “కూచ్ బీహార్” ?

0 178

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, భద్రత కోసం దేశం మరో సంచలన వార్తకు వేదిక కానున్నదా?.. కేంద్రం అత్యంత రహస్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చైనాకు సరిహద్దులో కీలకమైన ప్రాంతంలో ఉన్న”కూచ్ బెహార్” జిల్లాను మరియు అస్సాం రాష్ట్రంలో కొంత భాగాన్ని కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చబోతున్నది.

కూచ్ బెహార్ , కోచ్ బీహార్ లేదా కుచ్ బెహార్ అని కూడా ఉచ్ఛరిస్తారు , పట్టణం, తూర్పు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఈశాన్య భారతదేశం . ఇది టోర్సా నదికి తూర్పున ఉంది. ఈ జిల్లా తూర్పు హిమాలయ పర్వతపాదాల వద్ద ఉన్నది..

* కూచ్ బెహార్ కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణాలలో ఒకటి Siliguri Corridor.(సిలిగురి కారిడార్) or Chicken’s neck( కోడి మెడ) గురించి తెలుసుకోవాలి.. తెలుసుకుదాం..

సిలిగురి కారిడార్, లేదా కోడి మెడ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఒక ఇరుకైన భూభాగం, ఇది భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలుపుతుంది. ఇది ఇరుకైన కారిడార్ కేవలం 17కిమీ వెడల్పు మాత్రమే ఉంది..

Note: చైనా “Tawang” మీద దృష్టి పెట్టడానికి కారణం.. కూచ్ బెహార్ లో ఉన్న Chicken’s neck( కోడి మెడ) అక్రమిస్తే భారత్ నుండి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలన్నిటిని వేరు చేయవచ్చు అని..

LAC, నేపాల్, బంగ్లాదేశ్ మరియు భూటాన్ రాజ్యానికి అంతర్జాతీయ సరిహద్దుగా కూచ్ బెహార్ ఉంది…

కూచ్ బెహార్ ప్రాంతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉన్న వ్యూహాత్మక సైనిక నిర్మాణాలకు అనుసంధానించే రైల్వే నెట్‌వర్క్ యొక్క కేంద్రంగా కూడా ఉంది.

న్యూ జల్పైగురి (NJP)కూచ్ బెహార్ రైల్వే స్టేషన్ నుండి, చైనాకు ఎదురుగా ఉన్న మూడు ముఖ్యమైన సైనిక నిర్మాణాలను అనుసంధానించడానికి వేర్వేరు రైలు మార్గాలు ఏర్పాటు చేశారు.

NJP స్టేషన్ నుండి, అస్సాంలోని గౌహతి వైపు రైలు మార్గం వెళుతుంది. ఇక్కడ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన తవాంగ్ పట్టణం వైపు రోడ్డు నెట్‌వర్క్ వెళుతుంది.

పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, నేపాల్, భూటాన్ మరియు బంగ్లాదేశ్‌లకు వాణిజ్యం మరియు పర్యాటకం కోసం కూచ్ బెహార్ ప్రాంతం ముఖ్యమైనది.

కూచ్ బెహార్ కారిడార్ పశ్చిమ బెంగాల్‌ను మరియు అస్సాం, నాగాలాండ్ మరియు సిక్కింతో సహా ఈశాన్య భారతంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతూ రైలు మరియు రోడ్డు నెట్‌వర్క్‌కు కేంద్రంగా ఉంది…..

Leave A Reply

Your email address will not be published.

Breaking