Take a fresh look at your lifestyle.

జ్యోతి హైస్కూల్ లో బాలల కళోత్సవ్

0 16

జ్యోతి హైస్కూల్ లో బాలల కళోత్సవ్

ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు

జగిత్యాల, ఏప్రిల్ 21 : జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్, ఐఐటి అకాడమీ ,జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్, ప్లే స్కూల్ల ఆధ్వర్యంలో బాలల కళోత్సవ్ 2కే23 పేరిట అట్టహాసంగా నిర్వహించిన జ్యోతి వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాళోత్సవ్ కార్యక్రమంలో నర్సరీ నుండి పదవ తరగతి విద్యార్థులు వివిధ రకాల కళాఖండాలు ప్రదర్శించారు.

జానపద నృత్యాలు, అమ్మవారి నృత్యాలు, సావిత్రి గారి జీవిత గాధ, శివతాండవం,వండర్ కిడ్స్ పర్ఫామెన్స్ , కిచెన్ డాన్స్, హులహుప్ డాన్స్ ,వెస్ట్రన్ డాన్స్ తదితర కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. కన్న కొడుకు ఎదుగుదలకై తండ్రి పడే కష్టాలు, కొడుకు పై తల్లికి ఉండే అమృతమైన ప్రేమ గురించి విద్యార్థులు చేసిన రెండు నాటికలు అందరిని కంటనీరు పెట్టించాయి.
అలాగే మొబైల్ వాడటం వల్ల కలిగే నష్టాలను ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులకు కనువిప్పు కలిగించింది.జ్యోతి స్కూల్ విద్యార్థులు చేసిన ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు ఈ విద్యాసంవత్సరంలో సాధించిన ఘనతలు , విజయాలు చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బి.హరిచరణ్ రావు ,శ్రీధర్ రావు , జె.హరిచరణ్ రావు, మౌనిక రావు , రజిత రావు, అజిత రావు, సుమన్ రావు, ఉపాధ్యాయ బృందం , తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking