Take a fresh look at your lifestyle.

పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు

0 263

తెలంగాణ పోలీసు నియామక మండలి పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.

టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు మార్పులు చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ.. ఎస్ఐ(ఐటీ), ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది.

ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి వాయిదా వేయగా.. ఎస్ఐ(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసింది.

అంతేకాక.. ఏఎస్ఐ( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసిన టీఎస్​ఎల్​పీఆర్​బీ. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్చినట్లు ప్రకటించింది.

ఇప్పటికే పోలీసు నియామకంలో కీలకమైన శరీర దారుఢ్య పరీక్షలు పూర్తి చేసిన అభ్యర్థులు తుది పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తాజా నోటిఫికేషన్లలో కీలకమైన సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టు కోసం తలపడుతున్న అభ్యర్థుల్లో పోటీ తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకొంది.

ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉండటం విశేషం. కానిస్టేబుల్‌ పోస్టుల్లో సివిల్‌ విభాగానికి సంబంధించే అత్యధిక ఖాళీలుండటం.. ఇందులో పోటీ తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking