Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో సీబీఐ

0 149

సీబీఐ కోర్టులో సునీత ఇంప్లీడ్ పిటిషన్…

విచారణ మే 28కి వాయిదా

హైదరాబాద్ మార్చ్ 31 (వైడ్ న్యూస్) మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో సీబీఐ కోర్టు లో శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు మార్చినట్లు సీబీఐ కోర్టుకు సీబీఐ ప్రత్యేక పీపీ తెలిపారు.

సీబీఐ స్పెషల్ పీపీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 28కి వాయిదా వేసింది.వివేకానంద హత్య కేసు తెలంగాణ కు బదిలీ అయిన తరువాత మూడోసారి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. వివేకా హత్యకు సంబంధించి ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

ఈ కేసుకు సంబంధించి ఐదు మంది నిందితులు కోర్టుకు హాజరవ్వాలంటూ గత విచారణలో కోర్టు చెప్పింది. అయితే ఈరోజు కేవలం నలుగురు నిందితులు మాత్రమే కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఈరోజు విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నాని, ఖచ్చితంగా విచారణకు హాజకారుకావాల్సిన రోజు మాత్రమే తనను విచారణకు పిలవాలంటూ దస్తగిరి ఓ విజ్ఞప్తిని కోర్టుముందు ఉంచారు.

మరోవైపు సీబీఐ నుంచి కూడా వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు మార్చింది. కొత్త అధికారులను నియమించడంతో పాటు ఈ కేసును వచ్చే 30న పూర్తిస్థాయిలో విచారణను పూర్తి చేయాలని సుప్రీం డెడ్‌లైన్ విధించింది.అయితే ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలంటూ సునీతారెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్స్ జరుగుతున్న దశలో తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సునీతారెడ్డి తన విజ్ఞప్తిని కోర్టు ముందు ఉంచారు.

సునీత పిటిషన్‌ను కోర్టు స్వీకరించడంతో.. తదుపరి విచారణలో సునీత తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే సీబీఐ పీపీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఉన్న సమాచారాంతో పాటు ఆధారాలను సీబీఐ పీపీకి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సునీతారెడ్డి తన ఇంప్లీడ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

తదుపరి విచారణ వచ్చేనెల 28కి వాయిదా పడిన నేపథ్యంలో ఐదుగురు నిందితులు కోర్టు ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. దాంతో పాటు సునీత వేసిన ఇంప్లీడ్ ఫిటిషన్‌పై కూడా వాదనలు కొనసాగుతాయి. నెల రోజులపాటు జరిగే విచారణను సీబీఐ కోర్టు ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking