లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా కవిత
నిర్దేశం, ఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా చేర్చింది. గతంలో సాక్షిగా పరిగణించి ఆమె ఇంటికి వెళ్లి విచారించగా, ప్రస్తుతం నిందితురాలిగా చేర్చి 41 ఏసీ ఆర్ సీ కింద సమనులు జారీ చేసింది. నిందిరాలిగా చేర్చడంతో గులాబి పార్టీలో కలకలం రేపుతోంది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని సీబీఐ నోటీస్ జారీ చేసినందున ఎమవుతుందోనని బీఆర్ ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.