Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌ నై.. మళ్లీ టీఆర్‌ఎస్‌! – గులాబీ బాస్‌ మదిలో ఆలోచన

0 13

బీఆర్‌ఎస్‌ నై.. మళ్లీ టీఆర్‌ఎస్‌!
– గులాబీ బాస్‌ మదిలో ఆలోచన
– పార్టీ పేరు మార్చడం వల్లే ఎదురుదెబ్బలంటూ బాస్‌ ఎదుట శ్రేణుల ఆవేదన
– దిమ్మదిరిగే ఫలితాలు ఎదురుకావడంతో పునరాలోచనలో దళపతి
– పార్టీ పేరు మారడం ఖాయమంటూ సోషల్‌మీడియాలో జోరుగా చర్చ

బీఆర్‌ఎస్‌.. మళ్లీ టీఆర్‌ఎస్‌ కానుందా..? అవుననే అంటున్నారు గులాబీ శ్రేణులు. ఈ విషయంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుండటం కూడా ఇందుకు నిదర్శనం. పార్టీ అధికారానికి దూరమైన వేళ.. బీఆర్‌ఎస్‌ బాస్‌ చేసిన తప్పులు.. తీసుకున్న నిర్ణయాల్లోని లోపాల్ని కేసీఆర్‌ ఎదుట ప్రస్తావించే సాహసానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు.

TRS To BRS : టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్.. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం-election  commission approved trs party as brs party ,తెలంగాణ న్యూస్

తనకు మించిన మేధావి.. వ్యూహకర్త మరొకరు ఉండరన్న బలమైన నమ్మకం గులాబీ బాస్‌ లో ఎక్కువని చెబుతారు. గెలుపు మీద ధీమా ఉన్న వేళ.. తాము చేస్తున్న తప్పుల్ని గుర్తించేందుకు దళపతి ఇష్టపడరంటూ పార్టీలో ప్రచారం.

ఈ కారణంతోనే ఈ మధ్యన ముగిసిన ఎన్నికల్లో 90 సీట్లకు తగ్గవన్న అంచనాల్ని ఓపెన్‌ గా చెప్పేయటమే కాదు.. ఎవరైనా అది కష్టమన్న మాట చెబితే.. వారిని దూరం పెట్టిన పరిస్థితి కూడా పార్టీలో నెలకొంది.

ఎన్నికల ఫలితాలువెలువడటం..

తాము చెప్పుకున్న తొంభై సీట్ల సంగతి తర్వాత.. కీలకమైన పోలింగ్‌ ముందు నాటికి 75కు తగ్గవన్న సీట్లు కూడా రాకుండా కేవలం 39 సీట్లకు పరిమితం కావటం తెలిసిందే. అంటే తాను అంచనా వేసుకున్న సీట్లలో సగం కంటే ఒక్క సీటు మాత్రమే అదనంగా వచ్చింది.

ఈ ఫలితాల షాక్‌ తో గులాబీ బాస్‌ తో పాటు.. ఆయన పరివారానికి దిమ్మ తిరిగిపోయిన పరిస్థితి. బీఆర్‌ఎస్‌ కు వచ్చిన 39 సీట్లలో దాదాపు 15 సీట్లు గ్రేటర్‌ పరిస్థితిలో రాకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నది తెలిసిందే.

బీఆర్‌ఎస్‌ బాస్‌ చేసిన తప్పులు.. తీసుకున్న నిర్ణయాల్లోని లోపాల్ని కేసీఆర్‌ ఎదుట పార్టీలోని కొందరు సీనియర్లు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మీడియాలోనూ.. సోషల్‌ మీడియాలోనూ సాగుతున్న చర్చలు గులాబీ బాస్‌ మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆ మధ్యన బీఆర్‌ఎస్‌ గా మార్చిన పేరును మళ్లీ పాత పేరుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తన పరిధి.. బలం ఉన్న తెలంగాణను దాటేసి.. దేశం మొత్తాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌ పేరుగా మార్చేయటం పార్టీకి పెద్ద మైనస్‌ గా మారిందన్నమాట పలువురి నోట వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చిన నాటి నుంచి పార్టీకి ఎదురుదెబ్బలు తగలటమే కాదు.. పవర్‌ చేజారిన విషయాన్ని కేసీఆర్‌ సైతం గుర్తించినట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు కాకున్నా.. రానున్న రోజుల్లో ఇప్పుడున్న బీఆర్‌ఎస్‌ స్థానే టీఆర్‌ఎస్‌ గా మార్చటం ద్వారా పూర్వ వైభవం ఖాయమంటున్న వాదనకు సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. త్వరలోనే బీఆర్‌ఎస్‌ కాస్తా మరోసారి టీఆర్‌ఎస్‌ గా మారటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking