Take a fresh look at your lifestyle.

యాదగిరి గుట్ట దేవాలయంలో బ్రహ్మోత్సవాలు

0 62

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి

ఆలయంలో బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 6 : ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకంతో ఘనంగా ముగిశాయి. 31వతేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగిశాయి. ఏడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు.

పాత గుట్ట ఆలయం పూర్వ గిరి లక్ష్మీనరసింహస్వామి వారికి ఈ ఉత్సవాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు.

108 కలశాలలోని జలాలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించిన అనంతరం మహాదాశీర్వచనం,పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జ్ ఈఓ రామకృష్ణ, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking