Take a fresh look at your lifestyle.

చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ…

0 21

చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ
– మోదీ ధైర్యంతోనే బాబు అరెస్టు
– రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వడమే కారణమా..?
– చంద్రబాబుకు మద్దతుగా రోడ్ పైకి ప్రజలు
– ఏపీ ఎన్నికలలో జనసేన, కమ్యూనిష్టులతో టీడీపీ కలిసి పోటీ..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం.. కోట్ల రూపాయల అవినీతితో జైలులో ఉండి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి చంద్రబాబును అరెస్టు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
నిర్దేశం, హైదరాబాద్ :
టీడీపీ అధినేత బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే. అయితే మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన బాబుకు టీడీపీ కార్యకర్తలు.. సాప్ట్ వెర్ ఎంప్లాయ్స్.. ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు అరెస్టు ను ఖండాంచారు.
బాబు నోట రాని బీజేపీ మాట..
చంద్రబాబు మధ్యంతర బెయిల్ పొంది బయటకు రాగానే జైలు బయట ఆయన వేచి ఉన్న తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ అభినందనలు తెలిపారు. తనకు మద్దతు నిచ్చిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. కానీ, బీజేపీ నేతల పేర్లు ఆయన నోటి నుంచి వినపడలేదు. ముఖ్యంగా తనతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీతో పాటు అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ పార్టీ మినహా అందరికీ..
ఇక తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఎంలతో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పేరు కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. బీఆర్ఎస్ లో కొందరు నేతలు చంద్రబాబుకు మద్దతు పలకడంతో ఆయన తన కృతజ్ఞతలు తెలిపారని అనుకోవచ్చు. చివరకు కాంగ్రెస్ పేరు కూడా ఆయన ఉచ్ఛరించారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు హర్షకుమార్, చింతా మోహన్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడంతో ఆయన ధన్యవాదాలు తెలిపి ఉండవచ్చు.
బీజేపీ అగ్రనేతలను కలిసినా..
అయితే, బీజేపీ నేతల పేర్లు మాత్రం ఆయన నోటి నుంచి వినపడకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా అమిత్ షా నుంచి అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది. కానీ ఆ పేర్లు ఏమీ ఆయన ఎత్తేందుకు ఇష్టపడలేదు. ఏపీ బీజేపీ తొలి నుంచి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పు పట్టారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. దీంతో పాటు నారా లోకేష్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సమావేశమై చర్చించారు. ఇంత చేసినా చంద్రబాబు బీజేపీ పేరును తలచుకోక పోవడంపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. తన అరెస్ట్ వెనక బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని చంద్రబాబు నమ్ముతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పార్టీ నేతలు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి లాభం కోసం..
తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయక పోవడానికి వ్యూహత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం వస్తుందని భావించినట్లు తెలుస్తోంది. బీజేపీ సమీప భవిష్యత్ లో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. ఇక ముందు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలలో జనసేన, కమ్యునిస్టు పార్టీలతోనే కలసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ పేరు కూడా ఎత్తడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడం వెనక చాలా కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking