Take a fresh look at your lifestyle.

బీఆర్‌ఎస్‌కు బీటలు! సిట్టింగ్‌ ఎంపీలు సైతం హస్తం బాట

0 16

బీఆర్‌ఎస్‌కు బీటలు!

  • సిట్టింగ్‌ ఎంపీలు సైతం హస్తం బాట
  • ఇప్పటికే ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు
  • గులాబీ దళం ఒత్తిడితోనే నాయకుల పయనం
  • రాష్ట్రంలో హాట్‌ హాట్‌ చర్చ

బీఆర్‌ఎస్‌కు బీటలు వారుతున్నాయి. పార్టీలోని కీలక నేతలందరూ హస్తం బాట పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో భేటీ కాగా.. తాజాగా సిట్టింగ్‌ ఎంపీలు సైతం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు  సిట్టింగ్‌ ఎంపీలు ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం.  పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్‌ ఇస్తామని ఏఐసీసీ లీడర్ల నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.

పార్టీ మారాలంటూ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఒత్తిడి..

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేసిన పలువురు బిజినెస్‌ పర్సన్లు ఎంపీలుగా గెలిచారు. కానీ అందులో మెజార్టీ ఎంపీలు త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదట. వారంతా కాంగ్రెస్‌ టికెట్‌పై  పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని టాక్‌. క్యాడర్‌ సైతం పార్టీ మారేందుకు ఒత్తిడి తెస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలతో సంప్రదింపులు జరపగా, పార్టీలోకి వస్తే టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయను..

వీరు హస్తంగూటికి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని రాష్ట్ర పీసీసీ కీలక నేతలు సైతం సుముఖంగా ఉన్నారట. కాగా, పార్టీ మారే విషయంపై తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలకు ఆ ఎంపీ సంకేతాలు పంపినట్టు తెలుస్తున్నది. ‘ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయను. కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి’ అని తన అనుచరులకు ఇప్పటికే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్‌ అధిష్టానం

సిట్టింగ్‌ ఎంపీలు పార్టీ మారితే పరువు పోతుందని గ్రహించిన బీఆర్‌ఎస్‌ అధిష్టానం అలర్ట్‌ అయినట్లు సమాచారం. సదరు ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలోని ఇద్దరు కీలక నేతలు సదరు ఎంపీ ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. అక్కడే లంచ్‌ చేసిన తర్వాత ఆ ఇద్దరు లీడర్లు సదరు ఎంపీకి 4 గంటల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చి పార్టీలోనే కొనసాగాలని కోరినట్టు టాక్‌ వినిపిస్తోంది. ‘గత ఎన్నికల మాదిరిగా మొత్తం ఖర్చు నీవు ఒక్కడివే పెట్టుకోవద్దు. ఈసారి సగం పార్టీ ఇస్తది. పెద్ద సారు కూడా త్వరలో నీతో మాట్లాడుతరు’ అని భరోసా కల్పించే ప్రయత్నం చేశారని తెలిసింది. అయినా, ఆ ఎంపీ మనస్సు మార్చుకోలేదని, ఎలాగైనా పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం.

Beats for BRS! Sitting MPs are also involved

  • ఈదుల్ల మల్లయ్య

Leave A Reply

Your email address will not be published.

Breaking